Widgets Magazine

బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ - మహేష్ వార్...

మంగళవారం, 27 జూన్ 2017 (16:03 IST)

Widgets Magazine

బాక్సాఫీస్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, ప్రిన్స్ మహేష్ బాబులు నువ్వానేనా అంటూ తలపడనున్నారు. దీంతో ఇరు హీరోల అభిమానులు కూడా ప్రత్యక్షంగా పోటీపడేందుకు సిద్ధమయ్యారు. దీనికి కారణం ఈ ఇద్దరు హీరోలు నటించిన తాజా చిత్రాలు ఒకే నెలలో విడుదల కానున్నాయి.
jai lav kusha - spider
 
ముఖ్యంగా.. జూనియర్ ఎన్టీఆర్ చిత్రం "జైలవకుశ" సెప్టెంబ‌ర్ 21వ తేదీన విడుద‌ల చేస్తున్నారు. అలాగే, చాలా రోజులుగా సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న "స్పైడ‌ర్" చిత్రం సెప్టెంబ‌ర్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌నే వార్త ఫ్యాన్స్ చెవిన ప‌డింది. 
 
నిజానికి ఈ చిత్రం జూన్‌లో విడుదల చేస్తాన‌న్న మురుగ‌దాస్ ఇప్ప‌టికీ సినిమాని విడుద‌ల చేయ‌క‌పోవ‌డంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ కార‌ణంగా ఎలా అయిన సెప్టెంబ‌ర్‌కి "స్పైడ‌ర్"ని థియేట‌ర్‌లోకి తీసుకురావాల‌ని యూనిట్ ప్లాన్. దీంతో మ‌హేష్, ఎన్టీఆర్ మ‌ధ్య ఆసక్తిక‌ర ఫైట్ జ‌ర‌గ‌నుందంటూ ఇరువురి ఫ్యాన్స్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.
 
కాగా, జూనియర్ ఎన్టీఆర్ 'నాన్న‌కు ప్రేమ‌తో', 'జ‌న‌తా గ్యారేజ్' తర్వాత వస్తున్న చిత్రం 'జైలవకుశ'. అలాగే, మహేష్ బాబు 'శ్రీమంతుడు' తర్వాత వచ్చిన 'బ్రహ్మోత్సవం' బాక్సాఫీస్ వద్ద బోల్తాపడిన విషయం తెల్సిందే. ఇపుడు స్పైడర్‌తో ముందుకురానున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రూ.2వేల కోట్ల వసూళ్లతో ''దంగల్'' అదుర్స్.. అవతార్, జురాసిక్ వరల్డ్ సరసన?

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. భారత్ కంటే ...

news

ఛాన్సుల కోసం డైరెక్టర్ల వెంటపడుతున్న హీరోయిన్?

రాయ్ లక్ష్మి.. ఈ పేరు వినగానే ముందుగానే కాంచన సినిమా గుర్తుకొస్తుంది. లారెన్స్ పక్కన ఈ ...

news

జూ.ఎన్టీఆర్ పడక గదిలో కెమెరాలు.. ఎందుకో తెలుసా? (Video)

వెండితెర హీరో జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెర ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ హీరో ...

news

నా యాటిట్యూడ్ వల్లే గబ్బర్ సింగ్.. విమర్శించడానికి మీరెవరు : హరీష్ శంకర్

"నా యాటిట్యూడ్ వల్లే గబ్బర్ సింగ్ వచ్చింది. మంచి ఎంటర్‌టైనర్ వస్తే, రెవెన్యూలు చూడాలి ...