గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 29 సెప్టెంబరు 2015 (16:41 IST)

'శ్రీమంతుడు' మిస్ చేస్కున్న హీరో... సినిమా చూసి మెచ్చుకున్నాడు... నొచ్చుకున్నాడు... ఆ హీరో...

ఇది మామూలే. పోకిరి నుంచి శ్రీమంతుడు చిత్రం దాకా ఒకటే మిస్సింగ్. కథలను సెలెక్ట్ చేయడంలో మహేష్ బాబుకు మించినవారు లేరంటారు ఇండస్ట్రీలో. మహేష్ బాబు ఒక్కసారి కథకు కనెక్ట్ అయితే ఇక ఆ చిత్రం తీయడంలో దర్శకుడికి ఫ్రీ హ్యాండ్ ఇస్తారని ఇండస్ట్రీలో టాక్. ఇదిలావుంటే తాజాగా ఓ విషయం బయటపడింది.
 
అదేమంటే... శ్రీమంతుడు చిత్ర కథను కొరటాల శివ తొలుత జూనియర్ ఎన్టీఆర్  కు చెప్పారట. ఐతే ఈ కథ విన్న ఎన్టీఆర్... దత్తత, పల్లెటూరు... ఫార్ములా సూటు కాదేమో... అని రిజెక్ట్ చేశారట. దాంతో కొరటాల నేరుగా వెళ్లి ఇదే కథను మహేష్ బాబుకు వినిపించడంతో ఆయన మరో మాట మాట్లాడకుండా చేద్దామని చెప్పేశారట. అలా చెప్పడం సినిమా తీయడం, విడుదలవ్వడం, టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం 185 థియేటర్లలో 50 రోజులు దాటినా ఇంకా విజయవంతంగా ప్రదర్శించబడటం అంతా జరిగిపోయింది. 
 
ఈ వార్త తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన తాజా చిత్రం షూటింగ్ ముగించుకుని నేరుగా వెళ్లి శ్రీమంతుడు చిత్రాన్ని చూశాడట. ఆ వెంటనే హీరో మహేష్ బాబుకు ఫోన్ చేసి యాక్టింగ్ అదరగొట్టావని ప్రశంసించడమే కాకుండా... కొరటాలకు ఫోన్ చేసి మరో కథ ఏమైనా ఉంటే రెడీ చేసుకుని రమ్మని చెప్పాడట. అచ్చం ఇలాగే పవన్ కళ్యాణ్ కూడా పోకిరి కథను పూరీ తనకు చెబితే... రిజెక్ట్ చేశాడట. ఆ చిత్రాన్ని మహేష్ బాబు చేయడంతో ఎంత హిట్టు కొట్టిందో మనకు తెలిసిందే.