గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 11 అక్టోబరు 2015 (15:49 IST)

కల్యాణ్ రామ్ చేయి కింద ఉండదు... ఎపుడూ పైనే ఉంటుంది : జూనియర్ ఎన్టీఆర్

హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తాజా చిత్రం ఆడియోను మరో టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తనకంటే ముందు ప్రసంగించిన అన్న కళ్యాణ్ రామ్ చెప్పిన ప్రతి మాట నిజమేనన్నారు. అన్న చెప్పిన ప్రతి మాట వెనుక తానుంటానని, అయన ప్రతి అడుగును అనుసరిస్తానన్నారు.
 
 
ముఖ్యంగా.. ఇటీవల తమ గురించి కొందరు ఏవో వార్తలు రాశారని చెపుతూ, అలా రాయడాన్ని జూనియర్ ఎన్టీఆర్ తప్పుపట్టలేదు. కానీ, అలా రాసిన వారికి మాత్రం ఈ వేదిక ద్వారా వివరణ ఇచ్చారు. 'నాన్నకు ప్రేమతో' సినిమా షూటింగ్‌లో ఉండగా అన్న, వదిన, పిల్లలను చూసి వెళ్దామని వచ్చినప్పుడు, తన అన్న కష్టాల్లో ఉన్నాడని, 'కిక్ 2'కు డబ్బుల్లేక ఇబ్బంది పడుతుంటే సంతకాలు పెట్టేందుకు వచ్చానని మీడియాలో రాశారని గుర్తు చేశారు. 
 
అలా రాసిన వాళ్లు ఎందుకు రాశారో తనకు తెలియదు కానీ, జీవితంలో ఎప్పుడూ కల్యాణ్ రామ్ చేయి కిందికి జారదని, ఆయన ఎప్పుడూ పైచేయిగానే ఉంటారని స్పష్టం చేశాడు. తమ కుటుంబం తమకు నేర్పింది ఇవ్వడమేనని, చేయి చాచడం కాదని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నాడు. అన్నయ్య ఎప్పుడూ నవ్వుతూ, ఇలాగే కల్మషం లేకుండా, నిజాయితీగానే ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.