శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (02:12 IST)

ఆ రెండు సినిమాలు చేయలేదని ఆయన బాధ!

అటు శృంగార రసాన్ని, భక్తి రసాన్ని రెండు కళ్లుగా భావించుకుని తెలుగు కమర్షియల్ చిత్ర సీమ మర్చిపోలేని సినిమాలు తీసి మెప్పించిన దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు. అడవిరాముడు సినిమాతో మొదలైన ఆయన ప్రంభజనం గత 40 ఏళ్లుగా తిరుగులేకుండా టాలీవుడ్‌లో కొనసాగుతూనే

అటు శృంగార రసాన్ని, భక్తి  రసాన్ని రెండు కళ్లుగా భావించుకుని తెలుగు కమర్షియల్ చిత్ర సీమ మర్చిపోలేని సినిమాలు తీసి మెప్పించిన దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు. అడవిరాముడు సినిమాతో మొదలైన ఆయన ప్రంభజనం గత 40 ఏళ్లుగా తిరుగులేకుండా టాలీవుడ్‌లో కొనసాగుతూనే ఉంది. సినిమా కళకు అందం అనే కొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేసిన వాడు, భక్తి సినిమాల్లో అన్నమయ్యను గత శతాబ్ది మేటి చిత్రంగా నిలిపిన వాడు, భగవంతునికి భక్తునికి మధ్య అనుబంధాన్ని నాగార్జున సాక్షిగా చూపించి, భక్తిరస గంగాఝరిలో కోట్లమంది ప్రేక్షకులను ఓలలెత్తించినవాడు రాఘవేంద్రరావు. కాని ఇన్ని మహత్తర సినిమాలు తీసిన ఈ దర్శకేంద్రునికి కూడా ఒక తీరని బాధ ఉంటోదన్నది తాజాగా తెలిసిన విషయం. అదేదో ఆయన మాటల్లోనే విందాం. 
దాదాపు 40 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేశాను. కానీ, రెండు సినిమాలు చూసినప్పుడు మాత్రం చాలా బాధ అనిపించింది. ఒకటి ‘గాంధీ’, మరొకటి ‘భాగ్‌ మిల్కా భాగ్‌’. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన గాంధీ జీవిత చరిత్రను మనం తీయలేదు. దర్శకుడు రిచర్డ్‌ అటన్‌బరో ఇంగ్లిష్‌లో తీశారు. ‘మనల్ని బానిసలను చేసినవాళ్లే అంత బాగా తీస్తే మనం ఎందుకు తీయలేదు’ అని బాధపడ్డాను. అలాగే, మిల్కా సింగ్‌ జీవిత చరిత్రతో వచ్చిన ‘భాగ్‌ మిల్కా భాగ్‌’ చూసి, ‘మనం ఎందుకు చేయలేకపోయాం’ అని ఆలోచించాను.
 
ఈ మధ్య కొరటాల శివ తీసిన ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ నచ్చాయి. ఒక కమర్షియల్‌ సినిమాలో సమాజానికి ఉపయోగపడే విషయం చెప్పాడు. తీసే సినిమాలో ప్రయోజనాత్మక అంశం ఉంటే బాగుంటుందంటున్నా. భక్తి సినిమాలంటే రాఘవేంద్రరావుగారే తీయాలంటుంటారు. ఆ మాటతో ఏకీభవించను. నేటి తరం దర్శకులూ తీయగలరు. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలతో పాటు వాళ్లు ఏడాదికి ఈ తరహా సినిమా ఒకటి తీస్తే యూత్‌కు మన మూలాల గురించి చెప్పినట్టవుతుంది. పురాణాలకు సంబంధించిన పుస్తకాల్లో పది పేజీలు చదివినా చాలు.. భక్తి సినిమాలు తీసే అవగాహన వచ్చేస్తుంది అంటూ నేటి దర్శకులకు సూచన ఇచ్చారు రాఘవేంద్రరావు.