శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 26 సెప్టెంబరు 2016 (10:32 IST)

రజనీకాంత్ కబాలికి కష్టాలు.. పన్ను మినహాయింపుపై కోర్టులో పిటిషన్.. అసలే కూతురి వివాదం....

''లింగ'' అట్టర్ ప్లాప్ కావడంతో చాలా కష్టాలు ఎదుర్కొన్న తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్.. ప్రస్తుతం కబాలితో హిట్ కొట్టినా ఇబ్బందులు ఎదుర్కుంటున్నాడు. తన ప్రమేయం లేకుండానే రజనీ కాంత్ మరో వివాదాన్ని కేంద్ర

''లింగ'' అట్టర్ ప్లాప్ కావడంతో చాలా కష్టాలు ఎదుర్కొన్న తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్.. ప్రస్తుతం కబాలితో హిట్ కొట్టినా ఇబ్బందులు ఎదుర్కుంటున్నాడు. తన ప్రమేయం లేకుండానే రజనీ కాంత్ మరో వివాదాన్ని కేంద్ర బిందువుగా మారిపోయాడు. కబాలికి వినోదపు పన్ను మినహాయింపు ఎలా కల్పిస్తారంటూ మద్రాసు హైకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలైంది. 
 
తమిళ భాషాభివృద్ధి చర్యల్లో భాగంగా, తమిళంలో పేరు పెట్టే చిత్రాలకు, హింస, అశ్లీలం లేని చిత్రాలకు ప్రభుత్వం పన్ను రాయితీ కల్పిస్తోంది. ఇందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, ఈ కమిటీ అర్హత లేకున్నా భారీ బడ్జెట్‌ చిత్రాలకు పన్ను రాయితీ కల్పిస్తోందని పిటిషనర్ ఆ పిటిషన్‌‍లో ప్రశ్నించారు. 
 
ఇందుకు "కబాలి"ని పిటీషన్‌లో ఉదాహరణగా చూపారు. ఈ చిత్రంలో రజనీకాంత్ నటించారన్న ఒకే ఒక్క కారణంగానే పన్ను రాయితీ కల్పించారన్నారు. అందువల్ల ఈ చిత్రానికి పన్ను రాయితీ కల్పిస్తూ జూలై 21వ తేదీన రాష్ట్ర వాణిజ్య పన్నుల విభాగం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. 
 
అలాగే, ఈ చిత్రానికి చెల్లించాల్సిన మొత్తం పన్ను ఆ చిత్ర నిర్మాత చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై త్వరలో విచారణ జరుగనుంది. ఇప్పటికే కూతురు ఐశ్వర్య విడాకుల విషయంలో మనస్తాపంతో ఉన్న రజనీకాంత్‌కు కబాలిపై పిటిషన్ దాఖలు కావడంపై మరింత తలనొప్పి తప్పదని సినీ పండితులు అంటున్నారు.