శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : గురువారం, 28 ఏప్రియల్ 2016 (12:40 IST)

భజరంగీ భాయ్‌జాన్ దర్శకుడు కబీర్ ఖాన్‌కు పాక్‌లో చేదు అనుభవం.. ఏమైంది?!

''భజరంగీ భాయ్‌జాన్'' దర్శకుడు కబీర్ ఖాన్‌కు పాకిస్థాన్‌లో చేదు అనుభవం ఎదురైంది. కాన్ఫరెన్స్ నిమిత్తం కరాచీ వెళ్లిన కబీర్ ఖాన్‌ను కొంతమంది పాకిస్థాన్ వాసులు కరాచీ ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్థాన్‌లో భారత్ నిఘా సంస్థ 'రా' సాగిస్తున్న గూఢచర్యంపై ఎందుకు సినిమా తీయరని ఆందోళనకారులు నిలదీశారు. 
 
పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా చిత్రాలు తీయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి అయితే ఆగ్రహంతో ఊగిపోతూ ఖాన్‌కు తన షూ చూపించి హెచ్చరించాడు. కబీర్ ఖాన్ కాబూల్ ఎక్స్‌ప్రెస్(2006), న్యూయార్క్(2009), ఏక్ థా టైగర్(2012), భజరంగీ భాయ్ జాన్, ఫాంటం(2015)  చిత్రాలకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఆయన సినిమాల్లో చాలా భాగం పాకిస్థాన్ నేపథ్యంలోనే సాగుతుంది. 
 
పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా సినిమాలు తీస్తావా అని హెచ్చరించారు. పాకిస్తాన్ జిందాబాద్.. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ ఎయిర్ పోర్ట్‌లోకి వెళ్ళే వరకూ వెంటపడ్డారు. కబీర్ ఖాన్ తీసిన ''ఫాంటం'' సినిమా పాకిస్థాన్ లో వివాదాస్పమైంది. ఈ సినిమా విడుదలపై లాహోర్ హైకోర్టు నిషేధం విధించింది.