శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 6 నవంబరు 2015 (12:42 IST)

పవన్ నుంచి పిలుపొచ్చింది... కాజల్ ఎగిరి గంతేసింది.. ఎందుకు..?

కాజల్ హ్యాపీ హ్యాపీగా ఉంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి పిలుపు రావడంతో చందమామ హీరోయిన్ ఎగిరి గంతేస్తుంది. సర్దార్ గబ్బర్ సింగ్‌లో కాజల్ అగర్వాల్ హీరోయిన్. గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ చేసేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. హీరోయిన్ విషయంలో ఆచితూచి వ్యవహరించారు. ఈ క్రమంలో టాలీవుడ్ చందమామ కాజల్‌ను ఖరారు చేశాడు.
 
సర్దార్ హీరోయిన్‌గా కాజల్‌ను ఖరారు చేసి మూడు నెలలు గడిచినా.. ఆమెకు యూనిట్ నుంచి పిలుపు రాలేదు. షూటింగ్ మాత్రం యమా స్పీడుగా జరుగుతున్నా.. కాజల్‌కి మాత్రం యూనిట్ నుంచి పిలుపు రాలేదు.  మూడు నెలలైనా పిలుపు రాకపోవడంతో డల్‌గా ఉన్న కాజల్‌కు షూటింగ్‌లో జాయిన్ కావాల్సిందిగా కాజల్‌కి కాల్ వచ్చింది. 
 
ఈ నెల 17 నుంచి గుజరాత్‌లో జరగనున్న షూటింగ్‌కి హాజరు కావాలని యూనిట్ సభ్యులు చెప్పారు. అంతే కాజల్ అగర్వాల్ పవన్‌తో నటించనున్నానోచ్ అంటూ ఎగిరి గంతేసి తట్టాబుట్టా సర్దేసుకుంది. కాగా మహేష్ బాబు సరసన బ్రహ్మోత్సవంలోనూ కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.