Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విలన్ పాత్రలో నటి కాజోల్... రజినీ అల్లుడు ధనుష్ విఐపి2లో...

గురువారం, 13 జులై 2017 (18:42 IST)

Widgets Magazine
Kajol

కాజోల్..ఒకప్పుడు అటు తెలుగు, హిందీ చలన చిత్ర సీమను శాసించిన హీరోయిన్. కాజోల్, షారుఖ్ ఖాన్‌ల జోడి అంటే అప్పట్లో ప్రేక్షకులు ఎగబడి సినిమాలు చూసేవారు. కాజోల్‌కు వేలమంది అభిమానులే ఉన్నారు. అయితే కాజోల్, అజయ్ దేవగన్‌ని వివాహం చేసుకున్న తరువాత మెల్లగా సినిమాలకు దూరమైపోయారు. బుల్లితెరలో అవకాశం వచ్చినా నటించలేదు. హిందీలో అత్త క్యారెక్టర్లు వచ్చినా చేయలేదు. హీరోయిన్లకు అక్కగా చేయమన్నా చేయలేదు. ఎంత క్లోజ్ డైరెక్టర్లు చెప్పినా కాజోల్ మాత్రం సినిమాల్లో నటించడం కొన్ని రోజుల వరకు స్టాప్ చేసింది.
 
అయితే చాలా రోజుల గ్యాప్ తరువాత మళ్ళీ కాజోల్ సినిమాల్లోకి వస్తోంది. అది కూడా హిందీలో కాదు. ఏకంగా తమిళ, తెలుగు బాషల్లో. సూపర్‌స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ చిత్రంలో కనిపించనున్నారు కాజోల్. రఘువరన్ బిటెక్ పేరుతో తెలుగులో విడుదలై ఈ సినిమా విడుదల సాధించింది. తమిళంలో అయితే విఐపి పేరుతో విడుదలైన సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ తరువాత రెండవ భాగం చిత్రించాలని నిర్ణయం కూడా తీసేసుకున్నారు. అదే విఐపి-2. ప్రస్తుతం ఆ సినిమాలో విలన్‌గా నటించారు కాజోల్. పవర్‌ఫుల్ క్యారెక్టర్లో కాజోల్ చాలా రోజుల తరువాత కనిపించనున్నారు. 
 
ధనుష్ రాసిన ఈ సినిమా కథకు విలన్‌గా ఎవరు సరిపోతారని చూస్తుంటే కాజోల్ కరెక్టుగా ఉంటారని అనుకున్నారట. అందుకే స్వయంగా ధనుష్ వెళ్ళి కాజోల్‌ను ఒప్పించారట. ఇప్పటికే ఆ సినిమా దాదాపు పూర్తయ్యింది. ఇక విడుదల అవ్వడమే ఆలస్యం. కాజోల్ నటించిన ఈ సినిమాను చూసేందుకు ఇప్పటికే ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

తండ్రిని బాధపెట్టే ఏ పని నేనూ, సమంత చేయబోం.. పెళ్ళికి తర్వాత కూడా: చైతూ

టాలీవుడ్ ప్రేమికులు సమంత, నాగచైతన్య త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. తమ వివాహం కోసం సినిమా ...

news

పైసా వసూల్: నేను రూ.4కోట్లు తీసుకున్నానా? ఓవర్‌గా లేదూ.. ఛార్మీ

టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఛార్మీకి ప్రస్తుతం ఆఫర్లు అంతగా లభించట్లేదు. ...

news

కళాభవన్ మణి హత్యలోనూ దిలీప్‌‌కు లింక్?: మమ్ముట్టి ''సిస్టర్'' అంటే కమల్ ''భావన'' అన్నారు..

''జెమిని'' సినిమాతో తెలుగు తెరకు విలన్‌గా పరిచయమైన నటుడు కళాభవన్ మణి హత్య కేసులో కూడా ...

news

అక్కడ గోడ దూకారు.. కమల్‌ క్రేజ్ ఢమాల్: జూ.ఎన్టీఆర్‌కు బిగ్ బాస్ వద్దేవద్దు.. శ్రీముఖి కూడా?

తమిళ బిగ్ బాగ్ షోకు మెల్ల మెల్లగా వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో.. తెలుగులో ప్రారంభం ...

Widgets Magazine