శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : బుధవారం, 25 మే 2016 (12:52 IST)

లాస్‌ ఏంజిల్స్‌లో శభాష్‌ నాయుడు‌: బ్రహ్మానందం, అక్షర, శ్రుతిహాసన్‌లతో..!

కమల్‌ హాసన్‌ తన తాజా చిత్రం కోసం లాస్‌ ఏంజిల్స్‌ వెళ్ళారు. ఆయన తన బేనర్‌ అయిన రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 'శభాష్‌ నాయుడు' అనే సినిమా తీస్తున్నాడు. మలయాళ దర్శకుడు టీ.కే. రాజీవ్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకొని సెట్స్‌పైకి వెళ్ళేందుకు సిద్ధమైంది. 
 
మొదటి షెడ్యూల్‌ను అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో పూర్తి చేయనున్నారు. తెలుగు కమెడియన్‌ బ్రహ్మానందం ఓ కీలక పాత్రలో నటించనున్న ఈ సినిమాలో శృతి హాసన్‌, కమల్‌ కూతురుగా మరో కీలక పాత్రలో నటించనున్నారు. శృతి హాసన్‌ రెండో కూతురు అక్షరా హాసన్‌ కూడా ఈ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తుంది. ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం సమకూరుసున్నారు.