పార్టీ పెట్టాకే వసూళ్లు... కమల్ హాసన్

శుక్రవారం, 17 నవంబరు 2017 (08:31 IST)

kamal haasan

సినీ నటుడు కమల్ హాసన్ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. ఇందుకోసం ఆయన కింది స్థాయి నుంచి పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ స్థాయి నుంచి పునాదులు పటిష్టంగా వేసుకుని ఆ తర్వాత పార్టీ పెట్టాలన్న ఆలోచనతో ఆయన ముందుకెళుతున్నారు. 
 
అయితే, రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్టు కమల్ హాసన్ ప్రకటించిన వెంటనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు చందాలు కుప్పలుతెప్పలుగా పంపిస్తున్నారు. ఫలితంగా ఇప్పటికే రూ.30 కోట్లకు చేరుకున్నాయి. అయితే ఈ సొమ్ము మొత్తాన్ని ఆయా వ్యక్తులు, సంస్థలకు తిరిగి ఇచ్చేస్తానని కమల్ హాసన్ ప్రకటించారు. పార్టీ పేరు పెట్టలేదు.. ఆఫీస్ ప్రారంభించలేదు.. అప్పుడే విరాళాలు తీసుకోవటం తొందరపాటు నిర్ణయం అవుతుందన్నారు. ఆ డబ్బును తన దగ్గర ఉంచుకోవటం కూడా చట్టరీత్యా నేరమని ప్రకటించి ఆయన తన నిజాయితీని చాటుకున్నారు. 
 
అలా అని కమల్ హాసన్ పార్టీ పెట్టరా? అనే సందేహం వద్దు. కచ్చితంగా పార్టీ పెట్టి తీరతా. పేరు పెట్టిన తర్వాత.. పార్టీకి స్వరూపం వచ్చిన తర్వాత విరాళాలు కూడా తీసుకుంటాను అని కుండబద్దలు కొట్టారు. ఓ పార్టీ నడపాలి అంటూ ప్రజల భాగస్వామ్యం అవసరం అని.. అప్పుడే ఫండ్ తీసుకుంటానని వెల్లడించారు. తీసుకునే ప్రతి రూపాయికి లెక్క ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. దీనిపై మరింత చదవండి :  
Money Fans Public Kamal Haasan Political Party

Loading comments ...

తెలుగు సినిమా

news

సాయి పల్లవే కావాలంటున్న శర్వానంద్

ఫిదా సినిమా తరువాత సాయిపల్లవికి బోలెడన్ని అవకాశాలు వచ్చి పడుతున్నాయి. అయితే పల్లవి మాత్రం ...

news

ఈ 'కత్తి'కి ఏమైంది? 'సత్తు' కత్తి అవుతుందా? లేక 'మొద్దు'కత్తి అవుతోందా?

మన పెద్దలు చెప్పినట్లు... ఎంత బలహీనుడుగా వున్నా అవతలి వ్యక్తి చాలా బలంగా వుంటే, అతడితో ...

news

చెత్త సినిమాతో మీ ముందుకు వస్తే చెప్పుతో కొట్టండి: సిద్ధార్థ్ (Video)

గృహం సినిమా హీరో సిద్ధార్థ్.. మీడియా ముందు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. సిద్ధార్థ్, ...

news

నాన్సెన్స్... వెళ్తారా లేదా? నిర్మాతను కసురుకున్న రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడామె టాలీవుడ్ సూపర్ హీరోయిన్. ఆమె కాల్షీట్ల కోసం చాలామంది ...