శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 23 జూన్ 2016 (10:51 IST)

విశ్వరూపం-2ను ఆస్కార్ రవిచంద్రన్ ఎందుకు రిలీజ్ చేయలేదో నాకు తెలియదు: కమల్

సినీ లెజెండ్ కమల్ హాసన్ నటించిన విశ్వరూపం-2 దీపావళికి రిలీజయ్యే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో విశ్వరూపం-2పై జోరుగా ప్రచారం సాగుతున్నా.. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రస్తుతం శభాష్ నాయుడు సినిమా షూ

సినీ లెజెండ్ కమల్ హాసన్ నటించిన విశ్వరూపం-2 దీపావళికి రిలీజయ్యే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో విశ్వరూపం-2పై జోరుగా ప్రచారం సాగుతున్నా.. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రస్తుతం శభాష్ నాయుడు సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉన్న కమల్ హాసన్.. విశ్వరూపం-2 మూవీని నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ ఎందుకు విడుదల చేయడం లేదో తనకు తెలియదన్నారు.
 
విశ్వరూపం-2 తర్వాత ఉత్తమ విలన్, పాపనాశం, తుంగవనం సినిమాలను పూర్తిచేసిన కమల్.. ప్రస్తుతం శభాష్ నాయుడు చిత్రానికి దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమా డైరెక్టర్ రాజీవ్ అనారోగ్యం బారిన పడటంతో లాస్ ఏంజెల్స్‌లో చికిత్స పొందుతున్నారు. 2013లో వచ్చిన విశ్వరూపం సినిమాకు సీక్వెల్‌గా విశ్వరూపం-2 సినిమా షూటింగ్ పూర్తయ్యింది.
 
కానీ ఈ సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేదు. విశ్వరూపం సినిమాకు కమలే దర్శకత్వం వహించడంతోపాటు నిర్మాతగానూ వ్యవహరించారు. తెలుగులో డబ్బింగ్ అయిన ఈ సినిమా ఏకకాలంలో తమిళ, హిందీ భాషల్లో రూపుదిద్దుకోనుంది. ఈ నేపథ్యంలో దీపావళికి ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.