శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (16:25 IST)

పాక్ నటులపై నిషేధం విధించాలి.. మన సైనికులను కోల్పోయాం: కంగనా రనౌత్

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. హీరోలకు ధీటుగా మహిళలకు ప్రాధాన్యత గల రోల్స్ వస్తున్నాయనే దానిపై తాజాగా స్పందించింది. ఈ మార్పును గురించి ప్రస్తావించిన బాలీవుడ్‌

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. హీరోలకు ధీటుగా మహిళలకు ప్రాధాన్యత గల రోల్స్ వస్తున్నాయనే దానిపై తాజాగా స్పందించింది. ఈ మార్పును గురించి ప్రస్తావించిన బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌.. భారత్‌లో మహిళా సాధికారతకు ఇదే నిదర్శనమని చెబుతోంది. ''నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అసిస్టెంట్‌ మహిళా దర్శకులు, ఎడిటర్‌లు చాలా అరుదుగా కనిపించేవారు. 
 
మహిళా ప్రాధాన్య సినిమాలు కూడా తక్కువగా వచ్చేవి. కానీ పదేళ్లలో ఇండస్ట్రీలో చాలా మార్పు వచ్చింది. ప్రస్తుతం సినిమా సెట్‌కి వెళ్తే ఎక్కువ మహిళలే కనబడుతున్నారు. వివిధ రంగాల్లో మహిళలు విజయం సాధిస్తున్నారు. కాకపోతే.. మహిళలపై వివక్ష.. చిన్నచూపు కొనసాగుతోంది. కొంతమంది అమ్మాయిల మీద వివక్ష చూపిస్తుంటారు. ఆడపిల్లల్ని కనడానికి ఇష్టపడరు.
 
స్త్రీలు వేసుకునే దుస్తులను బట్టి వాళ్ల స్వభావాన్ని అంచనా వేస్తుంటారు. దీన్ని బట్టే వాళ్ల వ్యక్తిత్వం ఏంటో అందరికీ తెలిసిపోతుందని కంగనా రనౌత్. పొట్టి డ్రెస్సులు, గ్లామర్ షోను బట్టి మహిళల క్యారెక్టర్లను అంచనా వేయలేమని చెప్పుకొచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత సైనికులు జరిపిన మెరుపు దాడిపై కంగనా రనౌత్ మాట్లాడుతూ... పాకిస్థాన్‌ నటులపై నిషేధం విధించాలని పిలుపు నిచ్చింది. మన సైనికులను కోల్పోయామని వెల్లడించింది.