శృతి హాసన్ మేకప్ తీసేస్తే జడుసుకుంటాం... చండాలం... అందగత్తెలిక్కడున్నారు...

గురువారం, 12 అక్టోబరు 2017 (20:03 IST)

డబ్బింగ్ చిత్రాలనే బ్యాన్ చేయగలిగిన కన్నడిగుల ఆత్మగౌరవం ఏమిటో స్టార్ జగ్గేష్ నిరూపించాడు. అందునా అది తనకు సంబంధం లేని విషయం. తాజాగా కన్నడ నిర్మాత ఒకరు తన చిత్రంలో శృతి హాసన్ నటిస్తోందని ప్రకటన ఇచ్చాడు. ఇది చూసిన శృతి హాసన్ వెనువెంటనే తను ఏ కన్నడ చిత్రంలోనూ చేయడంలేదనీ, బాలీవుడ్ లోనే ఏలిన దాన్ని తను ఎప్పుడూ కన్నడలో చేయనని తూలనాడింది. 
Shruti Hassan
 
అంతే... నటుడు జగ్గేష్‌కు శృతి మాటలకు మండింది. శృతి హాసన్ కంటే అందగత్తెలు కర్ణాటకలో కన్నడిగుల్లో ఎందరో వున్నారు. శృతి హాసన్ ను మేకప్ లేకుండా చూడలేం. మేకప్ కనుక తీసేస్తే జడుసుకుంటాం. అంత చండాలంగా వుంటుందని డైరెక్టుగా బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చేశాడు. మన రాష్ట్రంలోని, మన భాషా హీరోయిన్లను ఎంకరేజ్ చేయకుండా శృతి హాసన్ వంటి పొగరుబోతుల చుట్టూ తిరగడం మన కన్నడ దర్శకనిర్మాతలు చేస్తున్న తప్పనీ, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని పౌరుషంగా బతకాలని ఆవేశంగా స్పందించాడు. 
 
ఇప్పుడు ఆయన వ్యాఖ్యలకు కన్నడ నాట అందరూ అభినందనలతో ముంచెత్తుతున్నారు. మరి మన టాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి ఏమిటో... అలియా భట్, మహేష్ బాబుతో చేస్తారని అనుకుంటారంటూ ఒకరు ప్రశ్నిస్తే... అసలు మహేష్ బాబు ఎవరో తనకు తెలియదని ఎద్దేవా చేసింది. ఇక తాప్సీ అయితే దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకు హీరోయిన్ల బొడ్డుపై కొబ్బరి చిప్పలు వేయడం తెలుసంటూ తూలనాడింది. కానీ మనవాళ్లు మాత్రం ఎంతమాత్రం స్పందించరు. కన్నడ ఇండస్ట్రీని చూసైనా ఇక్కడి హీరోయిన్లను ఎంకరేజ్ చేస్తే బాగుంటుందేమో...?దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నాగార్జునతో కలిసి ప్రెస్‌మీట్‌కు వచ్చిన కొత్త పెళ్లికూతురు సమంత.. (వీడియో)

టాలీవుడ్ అందాల తార సమంత పెళ్లికి తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఓంకార్ ...

news

నమితను ముచ్చటగా మూడోసారి పెళ్లాడనున్న శరత్ బాబు...

అందాలతారగా తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న స్టార్ హీరోయిన్ నమిత. తెలుగులో ఆశించిన ...

news

పవన్‌కు కొడుకు పుట్టడంపై అలా రియాక్టయిన చిరంజీవి

పవన్ కళ్యాణ్‌‌కు కొడుకు పుట్టాడని తెలిసిన మెగాస్టార్ చిరంజీవి ఆనందంలో తేలియాడాడు. మెగా ...

news

మణికర్ణిక కోసం కత్తిసాము ప్రాక్టీస్ చేస్తున్న కంగనా రనౌత్ (వీడియో)

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రస్తుతం ...