Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాహుబలికి తర్వాత "స్పైడర్''పై కన్నేసిన కరణ్ జోహార్..?

శనివారం, 3 జూన్ 2017 (12:01 IST)

Widgets Magazine

బాహుబలి సినిమాను బాలీవుడ్‌లో రిలీజ్ చేసిన ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్.. స్పైడర్‌పై కన్నేశాడు. బాహుబలిని బాలీవుడ్‌లో ప్రమోట్ చేసి సక్సెస్ అయిన కరణ్ జోహార్.. స్పైడర్ సినిమాను బాలీవుడ్‌లో తన పతాకంపై విడుదల చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలిసింది. బాహుబలిని బాలీవుడ్‌లో విడుదల చేసిన కరణ్ జోహార్.. స్పైడర్‌ను కూడా తమ బ్యానర్‌పై రిలీజ్ చేయడం ద్వారా పబ్లిసిటీ వస్తుందని భావిస్తున్నాడు.
 
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేహ్ బాబు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మురగదాస్ కాంబినేషన్లో 'స్పైడర్' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు చెందిన పోస్టర్, టీజర్‌లు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. 'స్పైడర్' టీజర్ ఇంటర్నెట్‌లో దూసుకుపోతోంది. ఇప్పటికే 63 లక్షలకు పైగా వ్యూస్‌ను ఈ టీజర్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ టీజర్‌ను చూసి సంతృప్తి వ్యక్తం చేసిన కరణ్ జోహార్.. బాలీవుడ్‌లో తన పతాకంపై రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. 
 
ఇకపోతే.. మహేష్ బాబు స్పైడర్ చెన్నై షెడ్యూల్ షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చెన్నై శివారు ప్రాంతమైన పూందమల్లి లోని జీ స్టూడియోలో చిత్రీకరించారు. స్పైడర్‌లో చాలావరకు కీలక సన్నివేశాలను చెన్నైలోనే చిత్రీకరించినట్లు సినీ వర్గాల సమాచారం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

భయంకర వ్యాధికి గురయ్యా.. సంపూర్ణారోగ్యంతో తిరిగివచ్చా: స్నేహా ఉల్లాల్

తెలుగులో తొలి సినిమా ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాలో గ్లామర్‌ను అద్భుతంగా పండించిన స్నేహ ...

news

మంచి మిత్రులం.. మాకు లేని బాధ మీకెందుకు.. అనేసిన అనుష్క

బాహుబలి సినిమాలో కలిసి పనిచేసిన కో స్టార్లలో ప్రభాస్‌కు మంచి స్నేహితుడిగా, రానాకు మంచి ...

news

చూపులతో కొలతలేసే 'ఫ్యాషన్‌ డిజైనర్‌' ఫూల్... రివ్యూ రిపోర్ట్

రాజేంద్రప్రసాద్‌, వంశీ కాంబినేషన్‌లో 32 ఏళ్ళనాడు వచ్చిన 'లేడీస్‌ టైలర్‌'కు సీక్వెల్‌గా ...

news

అల్లు అర్జున్‌తోనే తీద్దాం... ప్లీజ్... ప్లీజ్... రాజమౌళిని బతిమాలుతున్న నిర్మాత...

సినీ ఫార్ములా మారుతోంది. బాహుబలి ఇచ్చిన హిట్ దెబ్బకు దర్శకులకు వేల్యూ బాగా పెరిగింది. ...

Widgets Magazine