Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

30 సెకన్లలో కోటి వ్యూస్... ఎంతమంది ఉన్నారన్నది కాదు ఎవడున్నాడన్నది ముఖ్యం (టీజర్)

ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (11:01 IST)

Widgets Magazine
pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'కాటమరాయుడు'. డాలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్‌ శనివారం విడుదలైంది. ఈ టీజర్ విడుదలైన 30 సెకన్లలో కోటి వ్యూస్, లైక్‌లను కొట్టేసింది. సినిమాలో పవర్‌స్టార్ సర్‌ప్రైజ్ లుక్‌తో కనిపించగా పవర్ పంచ్ కూడా టీజర్‌లో వదిలారు. 'ఎంతమంది ఉన్నారన్నది కాదు ఎవడున్నాడన్నది' ముఖ్యం అంటూ పవర్ స్టార్ చెప్పిన ఒక్క డైలాగ్ చాలు ఫ్యాన్స్‌ను హుషారెత్తించడానికి. 'గోపాల గోపాల' తర్వాత డాలి - పవన్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పంచె కట్టుతో కనిపిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు.
 
అయితే, ఈ చిత్రం టీజర్ సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేసింది. ఆయన తాజా చిత్రం 'కాటమరాయుడు'. ఈ సాయంత్రమే కాటమరాయుడు టీజర్ రిలీజైంది. రిలీజైన కొద్ది నిమిషాల్లోనే యూట్యూబ్‌ని చీల్చి చెండాడు ఈ కాటమరాయుడు. టీజర్ రిలీజైన గంటలలోపే 5 లక్షలకు పైగా వ్యూస్. 50వేలకుపైగా లైకులు దక్కించుకొంది. ఇక, 3గంటల్లో 'కాటమరాయుడు' వ్యూస్ 1.3మిలియన్ మార్క్‌ని క్రాస్ చేసింది. లైకులు లక్ష దాటాయి. దీంతో పవన్ ప్రభంజనం ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది. 
 
గతంలో మరో చిత్రానికి ఇలాంటి స్పందన లభించలేదు. ఇప్పటికే రిలీజైన 'కాటమరాయుడు' ఫస్ట్ లుక్ పోస్టర్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఆ హీట్ చల్లారకముందే 'కాటమరాయుడు' టీజర్‌తో దుమ్ములేపుతున్నాడు. ఇక, సినిమా ముందుకొస్తే.. "మెగాస్టార్ ఖైదీ నెం.150" రికార్డులన్నీ బద్దలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నిర్మాతల మండలి ఎన్నికల బరిలో విశాల్... మద్దతు తెలిపిన కమల్‌హాసన్

తమిల చలన చిత్ర నిర్మాతల మండలి ఎన్నికల్లో కోలీవుడ్ యువ హీరో విశాల్ నిలిచారు. ఆయనతో పాటు.. ...

news

"మనమంతా దుర్యోధనులం... పరిశుద్ధుడైన అర్జునుడిగా మారదాం": రజినీకాంత్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఆధ్యాత్మిక వచనాలు పలికారు. "మనమంతా దుర్యోధనులం... ...

news

కామెంట్లను పట్టించుకుంటే ఇక పనిచేసినట్లే.. ఒకళ్లు ఇచ్చే క్రెడిట్‌ని ఆశిస్తే పైకొచ్చినట్లే అంటున్న శ్రుతి

ఒకళ్లు ఇచ్చే క్రెడిట్‌ని ఆశిస్తే పైకి రాలేం. అందుకే ప్రశంసలను ఆశించను. ఇతరుల నుంచి ...

news

ఆయన సరసన ఉంటే నాకేం? వాళ్లంటేనే భయం అంటున్న రెజీనా

తెలుగు చిత్రసీమలోకి బుల్లెట్‌లా దూసుకొచ్చి తనదైన ముద్ర వేసిన యంగ్ హీరోయిన్ రెజీనా ...

Widgets Magazine