గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 24 మార్చి 2017 (08:01 IST)

కాటమరాయుడు తొలిరోజు కలెక్షన్స్ ఎంత? అంతకంటే తగ్గితే ఒప్పుకోమంటున్న ఫ్యాన్స్‌లో టెన్షన్, టెన్షన్

అత్తారింటికి దారేది సినిమాతో తెలుగు సినిమా కలెక్షన్ల చరిత్రనే మార్చిపడేసిన పవన్ కల్యాణ్ 3 సంవత్సరాల తర్వాత మరో బ్లాక్ బస్టర్ లాంటి సినిమాతో ముందుకు వస్తున్నారు. అదే కాటమరాయుడు.

అత్తారింటికి దారేది సినిమాతో తెలుగు సినిమా కలెక్షన్ల చరిత్రనే మార్చిపడేసిన పవన్ కల్యాణ్ 3 సంవత్సరాల తర్వాత మరో బ్లాక్ బస్టర్ లాంటి సినిమాతో ముందుకు వస్తున్నారు. అదే కాటమరాయుడు. ఆ తర్వాత బాహుబలిని మినహాయిస్తే (దాని కలెక్షన్ల రికార్డును ఛేదించడం కల్లోమాటే అనేది వేరేవిషయం) నాన్ బాహుబలి చిత్రాల్లో ఈ సంక్రాంతికి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 సినిమా  తొలిరోజు కలెక్షన్ల విషయంలో రికార్డు సృష్టించింది. ఇప్పుడు పవన్ కల్యాణ్ అభిమానుల్లో ఒకటే టెన్షన్. చిరంజీవి రీఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 తొలిరోజు కలెక్షన్లను దాటకపోతే పరువు పోతుందన్నది అభిమానులకు దడ కలిగిస్తోంది. పవన్ కల్యాణ్ కంటే ఆయన అభిమానులనే ఈ ప్రశ్న కలవరపరుస్తోంది.
 
మెగాస్టార్ చిరంజీవి “ఖైదీ నంబర్ 150” సినిమా ద్వారా తొలిరోజు కొత్త రికార్డులను సృష్టించడంతో, మరి పవన్ ‘కాటమరాయుడు’ ఆ రేంజ్ ను అందుకుంటుందా లేదా అన్నది ట్రేడ్ వర్గాలలో సైతం ఓ ప్రశ్నగా మారింది. దీనికి కారణం… ఓ సాధారణ రీమేక్ సినిమాగా విడుదల కానుండడం ఒకటైతే, ప్రస్తుతం విద్యార్ధులు పరీక్ష సమయాలలో మునిగిపోవడం మరో ప్రధాన కారణం. దీంతో ‘నాన్ బాహుబలి’ రికార్డులు పవన్ సొంతమవుతాయో లేదో చూడాలి. 
 
అలాగే ఓవర్సీస్ మార్కెట్ విషయానికి వస్తే, ఇప్పటివరకు పవన్ 2 మిలియన్ మార్క్ ను అందుకున్నది లేదు. మహేష్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో పాటు నితిన్ వంటి హీరోల కెరీర్ లో కూడా 2 మిలియన్ మార్క్ ఉండడంతో, ‘కాటమరాయుడు’తో దీనిని అందుకుంటాడని అభిమానులు భావిస్తున్నారు. ప్రీమియర్స్ ద్వారా దాదాపుగా 1 మిలియన్ వసూలు చేస్తే, 2 మిలియన్ మార్క్ పెద్దగా కష్టసాధ్యం కాకపోవచ్చు. దీంతో ప్రీమియర్స్ తో ‘కాటమరాయుడు’ ఎంత సాధిస్తాడో అన్నది కూడా కీలకంగా మారింది.
 
సినిమా హిట్టు, ఫ్లాప్ అన్న టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ ను రాబట్టడంలో పవర్ స్టార్ రేంజ్ వేరు. నిజానికి పవన్ కు ఇదే ప్రధాన బలం కూడా. మరి అలాంటి పవన్ మరికొద్ది గంటల్లో “కాటమరాయుడు” రూపంలో సిల్వర్ స్క్రీన్ పై దర్శనమివ్వబోతున్నారు. దాదాపుగా ఒక ఏడాది తర్వాత విడుదల అవుతున్న పవన్ సినిమా కావడంతో, ప్రస్తుతం అభిమానులంతా టికెట్లను తెచ్చుకునే పనిలో ఉన్నారు. మల్టీప్లెక్స్ లలో ఫస్ట్ డేకు ఇప్పటికే అడ్వాన్సు బుకింగ్ లు క్లోజ్ అయిపోగా, బెనిఫిట్ షోల కోసం ఫ్యాన్స్ హంగామా మొదలైంది. మరి తొలి రోజు పవన్ స్టామినా ఎంత అన్నది కీలకంగా మారింది. 
 
ప్రస్తుతం తెలుగు సినిమా కలెక్షన్లకు రెండు మిలియన్ డాలర్లు ఒక పెద్ద బ్యారియర్‌లాగా ఉంది. ఇంతవరకు దీన్ని సాధించని పవన్ కల్యాణ్ ఈ శుక్రవారం విడుదలైన కాటమరాయుడు ద్వారా చరిత్రను బ్రేక్ చేస్తాడని  చేయాలని ఫ్యాన్స్ మొక్కుకుంటున్నారు. పవన్ గమ్మున ఉన్నా, ఆయన అభిమానుల్లో ఇది సాధ్యమవుతుందా లేదా అనే టెన్షన్ పీక్‌కి వెళ్లింది.