Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పవన్ ఫ్యాన్స్‌తో కత్తి మహేష్ సెల్పీలు... స్వీట్లు కూడా తినిపించుకున్నారు

శనివారం, 20 జనవరి 2018 (13:10 IST)

Widgets Magazine
kathi - pawan fans selfie

హీరో పవన్ కళ్యాణ్ అభిమానులతో సినీ విమర్శకుడు కత్తి మహేష్ సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత స్వీట్లు కూడా తినిపించుకున్నారు. కత్తి మహేష్‌పై కోడిగుడ్లతో దాడి చేసిన పవన్ ఫ్యాన్స్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. దీంతో కత్తి మహేష్ వెనక్కి తగ్గారు. ఫలితంగా వారిద్దరి మధ్య రాజీ కుదిరింది. 
 
కొంతకాలంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అభిమానులు, సినీ క్రిటిక్ కత్తి మహేష్‌ల మధ్య సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇది కాస్త ముదిరి కత్తిపై పవన్ అభిమానులు కోడిగుడ్లతో దాడి చేశారు. దీనిపై ఆగ్రహించిన కత్తి మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
 
అయితే, ఈ వివాదానికి ముగింపు పలకాలనే ఉద్దేశంలో కొందరు జనసేన నాయకులు రంగంలోకి దిగారు. మహేష్‌తో చర్చలు జరిపారు. మహేష్‌‌పై దాడి చేసిన వారు ముందుకు వచ్చి క్షమాపణ కోరారు. దీంతో కత్తి వెనక్కు తగ్గారు. మాధాపూర్ పీఎస్‌లో ఇచ్చిన తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు, కత్తి మహేష్‌తో కలిసి స్వీట్లు పంచుకుని, వివాదం సమసిపోయినట్లేనని ప్రకటించారు. అంతటితో ఆగకుండా కత్తితో పవన్ అభిమానులు సెల్ఫీలు కూడా తీసుకున్నారు. ఇకపై కత్తి మహేష్‌కు తమకు ఎలాంటి గొడవలు ఉండబోవని ప్రకటించారు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

హైదరాబాదులో సినిమా రీ షూట్: వేసవి కానుకగా ''రంగస్థలం"

రామ్ చరణ్ హీరోగా రూపుదిద్దుకుంటున్న రంగస్థలం సినిమా రీ షూటింగ్ జరుపుకుంటోంది. సుకుమార్ ...

news

రాజకీయ నేతల్లో 95 శాతం మంది నీచులు : మోహన్ బాబు

రాజకీయ నేతలుగా ఉన్నవారిలో 95 శాతం మంది నీచులు అని సినీ నటుడు డాక్టర్ మోహన్ బాబు అన్నారు. ...

news

ప్రియాంకా చోప్రా మళ్లీ హీటెక్కించింది... గాఢ చుంబనం ఎవరికో తెలుసా?

బాలీవుడ్ క్వీన్ ప్రియాంకా చోప్రా అంటే ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీ పడి చస్తోంది. ఆమెను తమతమ ...

news

యాంకర్ ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్ మూడేళ్ల పాటు రద్దు

ప్రముఖ యాంకర్ ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేశారు. కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే ...

Widgets Magazine