బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (15:01 IST)

కోలీవుడ్ కత్తి.. విజయ్ సరసన కీర్తి సురేష్.. కాజల్ అగర్వాల్ అవుట్!

కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తీకేయన్ సరసన రజనీ మురగన్ సినిమాలో నటించిన కీర్తి సురేష్‌కు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పటికే రామ్ సరసన నేను.. శైలజ సినిమాలో నటించిన కీర్తి సురేష్‌ను టాలీవుడ్ హీరోలు.. హీరోయిన్‌గా తమ సినిమాల్లో నటింపజేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్‌లో కీర్తికి బంపర్ ఆఫర్ దక్కింది. 
 
ప్రస్తుతం కోలీవుడ్ హీరో తెరి మూవీ షూటింగ్‌లో చాలా బిజీ బిజీగా ఉన్నాడు. ఏప్రిల్ నాటికి ఈ మూవీని రిలీజ్ ప్లాన్ చేసిన విజయ్.. తన తర్వాతి ప్రాజెక్ట్ ని కూడా రెడీ చేసేస్తున్నాడు. ప్లానింగ్ విషయంలో పర్ఫెక్ట్‌గా ఉండే విజయ్.. గ్యాప్ లేకుండా సినిమా చేస్తేస్తున్నాడు. ఏప్రిల్‌లో తెరి రిలీజ్ కానుండగా.. మే నుంచి కొత్త సినిమాలో విజయ్ నటించనుండటం విశేషం. 
 
భరతన్ దర్శకత్వంలో రూపొందే ఈ మూవీలో.. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌ని హీరోయిన్‌గా ఫిక్స్ చేశారనే వార్తలొచ్చాయి. కానీ అవన్నీ రూమర్స్ అని తేలిపోయింది. మలయాళ కుట్టి కీర్తి సురేష్‌తో జత కట్టేందుకు విజయ్ రెడీ అయిపోయాడు. సిటీ విలేజ్.. రెండు బ్యాక్ డ్రాప్‌లలోనూ నడిచే ఈ మూవీలో కీర్తి పాత్ర సంథింగ్ స్పెషల్‌గా ఉండనుందట. మలయాళ కుట్టి కీర్తి సురేష్ రాకతో కాజల్ అగర్వాల్ లాంటి హీరోయిన్స్‌కు సూపర్ ఛాన్సులు మిస్ అవుతున్నాయట.