మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 21 నవంబరు 2016 (11:02 IST)

శ్రీమంతుడుకు తర్వాత మహేష్‌తో కొరటాల సినిమా: టాలీవుడ్ యువరాణి ఆమేనా?

శ్రీమంతుడు సినిమాకు తర్వాత మహేష్ బాబు- కొరటాల దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న సినిమాకు అప్పుడే క్రేజ్ మొదలైంది. ఈ కొత్త మూవీ ముహూర్తం ఈ మధ్యే జరిగింది. శ్రీమంతుడు మూవీలో మహేష్-శృతి హాసన్ జంట అదిరిపోయింద

శ్రీమంతుడు సినిమాకు తర్వాత మహేష్ బాబు- కొరటాల దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న సినిమాకు అప్పుడే క్రేజ్ మొదలైంది. ఈ కొత్త మూవీ ముహూర్తం ఈ మధ్యే జరిగింది. శ్రీమంతుడు మూవీలో మహేష్-శృతి హాసన్ జంట అదిరిపోయింది. మహేష్ బాబు- శ్రుతిహాసన్‌ల కెమిస్ట్రీ సినిమాకు ప్లస్ అయ్యింది. 
 
అందుకే డైరెక్టర్ కొరటాల శివ ఈ కొత్త మూవీలో ప్రిన్స్ మహేష్‌కి సరైన జోడీ కోసం చూసి.. చూసి చివరికి కీర్తి సురేష్‌ని సెలెక్ట్ చేసాడట. ఇక అఫిషియల్ గా కీర్తిని అనౌన్ చేయడమే మిగిలిందని టాక్. నేను..శైలజ మూవీతో టాలీవుడ్‌కి పరిచయమైన కీర్తికి ఫస్ట్ మూవీతోనే క్రేజ్ వచ్చింది. టాలీవుడ్‌లో చాలా ఆఫర్లు వస్తున్నా సెలెక్టివ్ గా చేస్తోంది కీర్తి. 
 
ప్రస్తుతం నానితో నేను లోకల్ చేస్తున్న కీర్తికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబోలో రాబోయే మూవీలో హీరోయిన్‌గా లక్కీ ఛాన్ కొట్టేసింది. ప్రస్తుతం మహేష్ బాబుతో హీరోయిన్‌గా చేసే అవకాశం రావడంతో త్వరలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ కావడం ఖాయమని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.