Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భావనపై నిజంగానే అత్యాచారం చేయలేదా.. పోలీసుల యూటర్న్‌కి కారణమేంటి?

హైదరాబాద్, శుక్రవారం, 10 మార్చి 2017 (08:19 IST)

Widgets Magazine

మలయాళ హీరోయిన్ భావనపై లైంగిక వేధింపుల కేసు తుస్సుమంటోందా.. అమెపై వాహనంలోనే అత్యాచారం చేశారని తాము చూసినంత నమ్మకంగా తొలి రోజు మీడియాకు ఎక్కిన పోలీలులు ఏమీ జరగలేదని చెప్పడం షాక్ కలిగిస్తోంది. పైగా తమ దర్యాప్తు నివేదికతో సంతృప్తి చెందని పక్షంలో సీబీఐతో ఎంక్వైరీ చేయించుకోవచ్చని సవాలు చేస్తున్నారు కూడా..
Bhavana
 
మలయాళ హీరోయిన్‌ వేధింపుల కేసులో మరో ముందడుగు పడింది. ఈ ఘటనకు సంబంధించి కీలక సాక్ష్యం ఒకటి లభించిందని పేరు చెప్పటానికి ఇష్టపడని ఓ పోలీసు అధికారి గురువారం తెలిపారు. ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి తన వాహనంలో వెళ్తున్న హీరోయిన్‌ను కొందరు అడ్డగించి ఆమె కారులోనే రెండు గంటలపాటు వేధించారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పల్సర్‌ సుని అనే వ్యక్తిని, హీరోయిన్‌ వాహనం డ్రైవర్‌ మార్టిన్‌తోపాటు మొత్తం ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక సాక్ష్యం ఒకటి తమకు లభ్యమైందని పోలీసులు చెబుతున్నారు.
 
కారులో ఆమెను వేధిస్తుండగా మొబైల్‌లో తీసిన వీడియో బయటపడిందని పోలీసులు వెల్లడించారు. నిందితులు ఈ నేరానికి పాల్పడటానికి బ్లాక్‌మెయిల్‌ చేయాలనే యోచనే ప్రధాన కారణమని తేలిందని ఆయన చెప్పారు. ఈ ఘటన వెనుక మలయాళ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖుల హస్తం, భారీ కుట్ర కోణం ఉందని వచ్చిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. 
 
తమ దర్యాప్తుతో సంతృప్తి చెందని పక్షంలో సీబీఐతో ఎంక్వైరీ చేయించుకోవచ్చని.. తమకెటువంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు. కాగా, మార్టిన్‌, పల్సర్‌ సుని తదితరుల పోలీసు కస్టడీ గడువు రేపటితో ముగియనుంది. మలయాళ చిత్రపరిశ్రమ పరువు కాపాడటానికో లేక దాంట్లోని పెద్ద తలలను ఒడ్డున పడేయటానికో పోలీసులు చల్లబడిపోయారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘాతుకానికి ఒడిగట్టినవాడి డీఎన్‌ఎ కూడా వాడు అత్యాచారం చేశాడని చూపించిందని తొలిరోజు కేరళ సీనియర్ పోలీసు అధికారి చెప్పిన విషయం తెలిసింది. అంతలోనే ఏం మాయరోగం వచ్చిందో.. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బాహబలిని కట్టప్ప ఎందుకు చంపాడో నా ఫ్యామిలీకి కూడా చెప్పలేదు: కట్టప్ప సత్యరాజ్‌

రాజమౌళి తీస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి రెండో భాగం ఎంత విలువైనదో తనకు తెలుసు ...

news

ఆ తర్వాతి ప్రశ్న అడగనంటే చూపుతా.. బాహుబలిని కట్టప్ప చంపింది ఇక్కడే! గుట్టువిప్పిన రాజమౌళి

ఒక్క డైలాగ్... భారతీయ సినీ ప్రేక్షకులనే కాదు. ప్రపంచవ్యాప్తంగా మూవీ ఆడియన్స్‌ని ...

news

మహిళా శక్తితో పెట్టుకున్నాడు... వర్మను 52,000 మంది అలా చేయాలనుకుంటున్నారు....

రాంగోపాల్ వర్మ ఏదయినా వంకరటింకరగా మాట్లాడుతారనే పేరుంది. ఆయన ఎందులోనైనా వంకర మార్గాన్ని ...

news

నిర్మాత నవీన్‌తో మలయాళ నటి భావన నిశ్చితార్థం... పెళ్లెప్పుడంటే...

మలయాళ నటి భావన నిశ్చితార్థం గురువారం నాడు చాలా సింపుల్‌గా జరిగింది. కన్నడ సినీ పరిశ్రమకు ...

Widgets Magazine