శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , శనివారం, 11 మార్చి 2017 (05:37 IST)

చిరు ఎంత రికార్డు సృష్టించినా తమ్ముడు పవన్‌‌ అవలీలగా అధిగమించేశాడు.. దేంట్లో?

తొమ్మిదేళ్ల తర్వాత ముఖానికి మళ్లీ రంగులద్దుకున్న చిరంజీవి ఖైదీ 150 సినిమాతో కలెక్షన్ల మోత మోగించాడు కానీ అన్నయ్య సాధించిన అన్ని రికార్డులూ తమ్ముడు పవన్ ముందు దిగదుడుపే అయ్యాయని అభిమానులు తలపట్టుకుంటున

తొమ్మిదేళ్ల తర్వాత ముఖానికి మళ్లీ రంగులద్దుకున్న చిరంజీవి ఖైదీ 150 సినిమాతో కలెక్షన్ల మోత మోగించాడు కానీ అన్నయ్య సాధించిన అన్ని రికార్డులూ తమ్ముడు పవన్ ముందు దిగదుడుపే అయ్యాయని అభిమానులు తలపట్టుకుంటున్నారు. శాటిలైట్ ప్రసార హక్కుల విషయంలో ఖైదీ 150 సాధించిన రికార్డును పవన్ కల్యాణ్ కాటమరాయుడు అవలీలగా దాటేసింది. అన్నయ్య ఆర్భాటంతో రికార్డు సాధిస్తే, తమ్ముడు సైలెంటుగా దాన్ని బద్దలు కొట్టేశాడు.

థియేటర్ల వద్ద 164 కోట్ల రూపాయల వసూళ్లను సాధించిన మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ‘ఖైదీ 150’ శాటిలైట్ రైట్స్ విషయంలోనూ రికార్డు స్థాయి రేటునే పలికినట్టుగా తెలుస్తోంది. రీ ఎంట్రీతో చిరంజీవి సత్తా చాటిన ఈ సినిమా హక్కులను ఒక టీవీ చానల్ భారీ రేటును పెట్టి దక్కించుకున్నట్టు సమాచారం. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు.. ఖైదీ 150 శాటిలైట్ రైట్స్ ధర రూ.12 కోట్ల వరకూ పలికింది.
 
సినిమా హిట్ అయిన నేపథ్యంలో టీవీ చానళ్లు ఈ సినిమా రైట్స్ కోసం పోటీ పడ్డాయి. చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ప్రసార హక్కులను దక్కించుకోవడానికి ప్రయత్నించాయి. దీంతో రేటు పన్నెండు కోట్ల రూపాయల వరకూ పలికినట్టుగా తెలుస్తోంది.
 
మరి చిరంజీవి సినిమా శాటిలైట్ రైట్స్ భారీ స్థాయి రేటుకే పలికినా.. పవన్ కల్యాణ్ తాజా సినిమా ప్రసార హక్కుల రేటు స్థాయిని మాత్రం అందుకోలేకపోయింది. పవన్ హీరోగా నటిస్తున్న ‘కాటమరాయుడు’ సినిమాను ఏకంగా 12.5 కోట్ల రూపాయలకు అమ్మారట.
 
ఈ విధంగా పవన్ కల్యాణ్ సినిమా చిరు సినిమా స్థాయి కన్నా ఎక్కువ మొత్తాన్ని సంపాదించుకోగలిగినట్టు తెలుస్తోంది. తేడా యాభై లక్షల రూపాయలే అయినప్పటికీ ఎక్కువ రేటు పవన్ కల్యాణ్ సినిమానే పలికింది. ఏదేమైనా ‘ఖైదీ-150’ సినిమా నిర్మాత రామ్ చరణ్ తేజకు శాటిలైట్ రైట్స్ డబ్బు బోనస్ అనే చెప్పాలి.