బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 18 జనవరి 2017 (07:02 IST)

'ఖైదీ' కుమ్ముడుకు తట్టుకోలేక పోతున్న 'బాహుబలి'... జిల్లాల్లో రికార్డులు గల్లంతు!

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'ఖైదీ నంబర్ 150'. సంక్రాంతి బరిలో అందరికంటే ముందుగా బరిలోకి దూకిన చిత్రం. ఈనెల 11వ తేదీన విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని కలెక్షన్ల సునామీ సృ

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'ఖైదీ నంబర్ 150'. సంక్రాంతి బరిలో అందరికంటే ముందుగా బరిలోకి దూకిన చిత్రం. ఈనెల 11వ తేదీన విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఫలితంగా.. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి - హీరో ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన సెన్సేషనల్ మూవీ 'బాహుబలి ది బిగినింగ్' రికార్డులు గల్లంతైపోతున్నాయి. ఓవర్సీస్‌లో మినహా తెలుగు రాష్ట్రాల్లో 'ఖైదీ' కలెక్షన్ల కుమ్ముడుకు 'బాహుబలి' తట్టుకోలేక పోతోంది. కొన్ని జిల్లాల వారీగా 'ఖైదీ', 'బాహుబలి' కలెక్షన్లను పరిశీలిస్తే.... 
 
సినిమా విడుదలైన తొలి వారంలో చాలా చోట్ల 'బాహుబలి' కలెక్షన్లను 'ఖైదీ' దాటేసింది. కృష్ణా జిల్లాలో తొలి వారం 'బాహుబలి' రూ.3.63 కోట్ల షేర్ వసూలు చేస్తే.. 'ఖైదీ' రూ.3.77 కోట్లు సాధించేసింది. పశ్చిమగోదావరి జిల్లాలో 'బాహుబలి'కి రూ.4.48 కోట్లు వస్తే.. చిరు సినిమా వారానికి ఒక్కరోజు ముందే రూ.4.55 కోట్లు కొల్లగొట్టింది. 
 
తూర్పుగోదావరి జిల్లాలో 'ఖైదీ' రూ.5.92 కోట్లు, నెల్లూరులో ఆరో రోజుకు వచ్చే సరికి రూ.2.25 కోట్ల చొప్పున కలెక్షన్లను సాధించింది. ఈ రెండు జిల్లాల్లోనూ 'బాహుబలి'ని 'ఖైదీ' బీట్ చేసింది. వైజాగ్‌లోనూ 'బాహుబలి'పై చిరు సినిమా పైచేయి సాధించింది. ఇదే జోష్ కొనసాగితే ఫుల్ రన్‌లో మెగాస్టార్ సినిమా 'బాహుబలి' రికార్డులను బీట్ చేయడం కష్టమేమీ కాదంటున్నారు సినీ విశ్లేషకులు.