శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2016 (10:51 IST)

12న 'కృష్ణగాడి వీరప్రేమ గాథ': నాని యాక్టింగ్ అదిరిపోద్ది.. దర్శకుడు

అసలైన ప్రేమ అంటే ఎలా వుంటుందో.. ఎలా ఉండాలో? అనేది తాము చూపించే ప్రయత్నం చేశామని...దర్శకుడు హను రాఘవపుడి తెలియజేస్తున్నాడు. నాని, మెహ్రెన్‌ కౌర్‌ జంటగా 14 రీల్స్‌ ఎంటర్టైన్మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'కృష్ణగాడి వీరప్రేమ గాథ'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌‌లోని విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 
 
దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ.. ''ఏడాదిన్నర పాటు ఈ  సినిమాకు పనిచేశాం. హీరో, హీరోయిన్‌ల మధ్య జరిగే కొన్ని మూమెంట్స్‌, ఇన్సిడెంట్స్‌‌తో జరిగే కథే ఈ సినిమా. నాని సినిమాను నెక్స్ట్‌ లెవెల్‌‌కు తీసుకువెళ్ళాడు. విశాల్‌ మూడు సంవత్సరాలుగా నాకు తెలుసు. ఈ సినిమాకు మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు అని చెప్పారు.