శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 25 నవంబరు 2015 (11:57 IST)

కృతిసనన్‌కు షారూఖ్ బ్రేకిస్తాడో లేదో: బంపర్ హిట్ కోసం..?

టాలీవుడ్‌లో ప్రిన్స్ మహేష్ బాబు సినిమా 1 నేనొక్కడినే ద్వారా కృతి సనన్ అరంగేట్రం చేసింది. ఆపై నాగచైతన్యతో దోచెయ్ చిత్రాల్లో మెరిసినా.. తెలుగు ఇండస్ట్రీలో ఆశించిన బ్రేక్ రాలేదు. దీంతో ఇప్పుడు బాలీవుడ్ మీద బోలెడన్ని ఆశలు పెట్టుకుంది కృతిసనన్. బాలీవుడ్‌లో షారూఖ్ ఖాన్ కాజల్ అగర్వాల్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న దిల్ వాలేపై అమ్మడు ఎన్నో ఆశలు పెట్టుకుంది. 
 
బాలీవుడ్‌లో ఓ హిట్ కొట్టేస్తే ఆపై ఛాన్సులు సులభంగా లభిస్తాయని కృతి సనన్ భావిస్తోంది. దిల్ వాలే సినిమాకు సంబంధించి ఇప్పటికే షారూఖ్ కాజోల్ సాంగ్ రిలీజైంది. ప్రస్తుతం వరుణ్ ధావన్ కృతి సనన్‌లపై ఓ రొమాంటిక్ పాటను విడుదల చేయనున్నారు. ఈ మూవీ తర్వాత మంచి ఆఫర్లు తలుపుతడతాయని కృతి సనన్ ఆశలు పెట్టుకుంది. మరి దిల్ వాలే హిట్టవుతుందో.. ఫట్ అవుతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సరసన ఓ  కొత్త  సినిమాలో కృతి నటించనుంది.