శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2015 (17:25 IST)

సర్దార్ గబ్బర్ సింగ్: పవన్‌తో కలిసి స్టెప్పులేయనున్న లక్ష్మీ రాయ్

డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ గర్ల్ ఫ్రెండ్, లక్ష్మీ రాయ్.. అదే నండీ రాయ్ లక్ష్మీ ఐటమ్ గర్ల్‌గా మారనుంది. టాలీవుడ్‌లో తొలిసారిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి స్టెప్పులేయనుంది. ఈ విషయాన్ని రాయ్ లక్ష్మీనే ధ్రువీకరించింది.

సర్దార్ గబ్బర్ సింగ్‌లో తాను కీలక పాత్ర పోషిస్తున్నానని.. అంతేగాకుండా పవన్ కల్యాణ్‌తో కలిసి తొలిసారి స్టెప్పులేయనున్నట్లు చెప్పింది. తద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ బిగ్ ట్రీట్ ఇవ్వనున్నట్లు లక్ష్మీ రాయ్ చెప్పింది. 
 
తన పాత్ర, తన డ్యాన్స్ గురించి ఫ్యాన్స్ తప్పకుండా స్పెషల్‌గా మాట్లాడతారని లక్ష్మీ రాయ్ ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో మెరుగైన సినీ అవకాశాలు లేకుండా కష్టాల్లో ఉన్న లక్ష్మీ రాయ్‌కి పవన్ చెంతన నటించడం ద్వారా మంచి ఆఫర్స్ వస్తాయని సినీ పండితులు జోస్యం చెప్పారు.