Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

లక్ష్మీస్‌ వీరగ్రంథం యూనిట్‌కు చుక్కెదురు..

మంగళవారం, 14 నవంబరు 2017 (09:34 IST)

Widgets Magazine
ntramarao

'లక్ష్మీస్‌ వీరగ్రంథం' సినిమా షూటింగ్‌కు ఆదిలోనే దెబ్బతగిలింది. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో సన్నివేశాల చిత్రీకరణకు ప్రయత్నించిన యూనిట్‌కు గ్రామ పంచాయతీ చుక్కలు చూపించింది. లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాకు అడ్డంకులు తప్పడం లేదు. ఈ సినిమా ముహూర్తం సన్నివేశాన్ని హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద చిత్రీకరించేందుకు ఇటీవల చిత్ర బృందం ప్రయత్నించింది. అయితే, దీనిని పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. 
 
అనంతరం ఈ చిత్రయూనిట్ ఎన్టీఆర్ స్వస్థలమైన కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని నిమ్మకూరులో జరిపేందుకు చేసిన ప్రయత్నాలను ఆ గ్రామవాసులు అడ్డుకున్నారు. ఎన్టీఆర్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు చిత్రీకరించేందుకు పంచాయతీ పెద్దలను ఈ సినిమా దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆశ్రయించారు. సన్నివేశాల చిత్రీకరణకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతో సమావేశమైన పంచాయతీ పాలకవర్గం, గ్రామపెద్దలు చిత్రీకరణకు అభ్యంతరం తెలిపారు. 
 
ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్‌తో పాటు నిమ్మకూరుకు కూడా చెడ్డపేరు వస్తుందని.. అందుకే అనుమని ఇవ్వలేమని స్పష్టం చేశారు. దీంతో గ్రామస్థులకు ఇష్టం లేకుండా సన్నివేశాలు చిత్రీకరించమని చెప్తూ సినీ యూనిట్ ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు చేసి.. నివాళులు అర్పించి వెనుదిరిగారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

శింబు పాడిన పెద్దనోట్ల పాట వైరల్.. బీజేపీ భయంతో.. పటిష్ట భద్రత (వీడియో)

గతంలో శింబు పాడిన బీప్ సాంగ్ పెను వివాదాన్ని రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోలీవుడ్ ...

news

ముందు పొట్ట.. వెనుక బట్ట.. జబర్దస్త్ ఆదిపై మహేష్ కత్తి ఫైర్.. (వీడియో)

బిగ్‌బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయిన మూవీ క్రిటిక్ మహేష్ కత్తి ఆ షో నుండి ఎలిమినేట్ అయిన ...

news

కీర్తి సురేష్‌ బాగానే బుట్టలో వేసుకుంటోంది! (వీడియో)

వెండితెరపై సందడి చేస్తున్న మలయాళీ భామల్లో కీర్తి సురేష్ ఒకరు. ఇటు టాలీవుడ్‌లోనే కాకుండా, ...

news

పవన్‌కు రూ.40కోట్ల ఆఫర్.. రజనీని బీట్ చేస్తారా? మరి ఎన్నికల సంగతి?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం పూర్తిస్థాయి రాజకీయాల్లో రావాలా? లేకుంటే సినిమాల్లో ...

Widgets Magazine