గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2016 (14:23 IST)

లావణ్య త్రిపాఠికి ఆఫర్ల వెల్లువ: కోలీవుడ్‌ ఎంట్రీకి రెడీ అవుతుందోచ్!

భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా సినిమాలతో మంచి పేరు కొట్టేసిన సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠికి ఆఫర్లు బాగానే వస్తున్నాయి. ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ అడ్రస్ లేకుండా పోయినా, తాజాగా అల్లు శిరీష్‌తో నటిస్తూనే.. ఇంకో క్రేజీ సినిమా ఆఫర్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ఆమె కోలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టేస్తుండటం విశేషం. సందీప్ కిషన్ హీరోగా తమిళ దర్శక నిర్మాత సీవీ కుమార్ ఓ సైఫై థ్రిల్లర్ ఒకటి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. 
 
ఈ ద్విభాషా చిత్రంగా తెరకెక్కే సినిమాకు తొలుత తాప్సీని అనుకున్నారు. ఐతే తాప్సీని తప్పించి.. ఆ స్థానంలోకి లావణ్య త్రిపాఠిని తీసుకున్నట్లు సమాచారం. లావణ్యకు ఇదే తొలి సినిమా కాబోతుండటం విశేషం. తమిళంలోనూ హీరోయిన్ల కొరత బాగా ఉంది కాబట్టి.. లావణ్యకు తెలుగు తరహాలో లక్కు కలిసొస్తే అక్కడా బిజీ అయ్యే అవకాశముంటుంది.