Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాగచైతన్య - సాయి కొర్రపాటి-సురేష్ బాబుల కాంబినేషన్ చిత్రం ప్రారంభం!

మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (11:28 IST)

Widgets Magazine
naga chaitanya - lavanya tripathi

నాగచైతన్య, లావణ్య త్రిపాఠి జంటగా ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసి వారాహి చలన చిత్రం సంస్థ నిర్మిస్తున్న చిత్ర ప్రారంభోత్సవం మంగళవారం పలువురు సినీ ప్రముఖులు, ఆత్మీయుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. 
 
కృష్ణ ఆర్.వి.మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి "పెళ్లి చూపులు" ఫేమ్ వివేక్ సాగర్ సంగీత సారథ్యం వహించనుండగా.. శతచిత్ర కథానాయకుడు శ్రీకాంత్ కీలకపాత్ర పోషిస్తుండడం విశేషం. వారాహి చలన చిత్రం ఆఫీస్‌లో లాంఛనంగా జరిగిన ఈ ప్రారంభ వేడుకకు సురేష్ బాబు, ఎస్.ఎస్.రాజమౌళి, కీరవాణి, విజయేంద్రప్రసాద్, శ్రీకాంత్, గుణ్ణం గంగరాజు, దేవినేని ప్రసాద్, అవసరాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. "సురేష్ బాబుతో కలిసి వారాహి చలనచిత్రం బ్యానర్‌లో నాగచైతన్య హీరోగా సినిమా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించనుండగా.. శ్రీకాంత్, రావు రమేష్‌‌లు కీలకపాత్రలు పోషించనున్నారు. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి గుణ్ణం గంగరాజు క్లాప్ కొట్టగా.. ఎం.ఎం.కీరవాణి కెమెరా స్విచ్చాన్ చేశారు. రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. సురేష్ బాబు, దేవినేని ప్రసాద్‌లు స్క్రిప్ట్‌ను దర్శకుడు కృష్ణ ఆర్.వి.మారిముత్తుకు అందించారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది" అన్నారు. 
 
ఈ చిత్రానికి సమర్పణ: సాయి శివాణి, లైన్ ప్రొడ్యూసర్: కార్తికేయ, కథ: డేవిడ్ ఆర్.నాథన్, మాటలు: అబ్బూరి రవి, స్క్రీన్ ప్లే: డేవిడ్ ఆర్.నాథన్ - అబ్బూరి రవి, కళ: రామకృష్ణ, సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాణం: వారాహి చాలనచిత్రం, నిర్మాత: రజని కొర్రపాటి, దర్శకత్వం: కృష్ణ ఆర్.వి.మారిముత్తు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అబ్బా.. కత్రినా కైఫ్‌కు పంటి నొప్పి.. మొహం వాచిపోయిందట.. డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదట...

బాలీవుడ్ అందాల సుందరి కత్రినా కైఫ్‌ షూటింగ్‌ల్లో బిజీ బిజీగా ఉంది. దీనికి తోడు పంటి ...

news

నాన్నగారి జీవిత చరిత్రలో నటిస్తా.. ఎన్టీఆర్ పాత్రధారిని నేనే : నటసింహా బాలకృష్ణ

విఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు ఆరాధ్య నటుడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను సినిమాగా ...

news

ఆ రెండు సినిమాలు చేయలేదని ఆయన బాధ!

అటు శృంగార రసాన్ని, భక్తి రసాన్ని రెండు కళ్లుగా భావించుకుని తెలుగు కమర్షియల్ చిత్ర సీమ ...

news

తిరుమలపై మన అవగాహననే మార్చేస్తున్న చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’

నేటి తరానికి, భవిష్యత్‌ తరాలకు మన చరిత్ర గురించి చెప్పాలని ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ...

Widgets Magazine