Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ భయంతోనే దేశం వదిలి వెళ్ళిపోయా.. రవితేజ అంటే ఇష్టం: ఇలియానా

మంగళవారం, 4 జులై 2017 (15:19 IST)

Widgets Magazine
ileana

తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించిన ఇలియానా.. ప్రస్తుతం బిటౌన్‌లో మకాం వేసింది. అక్కడ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. అప్పుడప్పుడు ఫోటోగ్రాఫర్ అయిన తన బాయ్‌ఫ్రెండ్‌తో షికార్లు వేస్తూ.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో టచ్‌లో వుంది ఇలియానా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇలియానా మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లో హిందీ తెలియక ఎన్నో అవస్తలు పడ్డానని చెప్పుకొచ్చింది.
 
సినిమా ప్రమోషన్లలో మీడియా ప్రతినిధులు తనను హిందీలో మాట్లాడాలని కోరేవారని.. అప్పుడు చాలా భయమేసి.. మూడు వారాల పాటు భారత్‌ను వదిలి వెళ్ళిపోయానని సినీ నటి ఇలియానా తెలిపింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తెలుగు, హిందీ భాషలు అస్సలు రావని.. అందుకే సెట్స్‌లో ఎక్కువగా ఇంగ్లీష్‌లోనే మాట్లాడేదాన్నని ఇలియానా వెల్లడించింది. అయితే అభిమానులు ఇంతగా ఆదరిస్తారని మాత్రం తాను ఊహించలేదని, ప్రస్తుతం బాలీవుడ్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టానని ఇల్లీ తెలిపింది. 
 
తన తాజా చిత్రం ముబారకన్‌లో తాను పంజాబీ అమ్మాయిగా కనిపిస్తానని ఇలియానా తెలిపింది. దక్షిణాది చిత్ర రంగంలో తాను అక్షయ్ కుమార్ లాంటిదాన్నని... ఆయన మాదిరే తాను కూడా ఏడాదికి నాలుగు చిత్రాలు చేసేదాన్నని చెప్పింది. తెలుగులో అందరు అగ్ర హీరోలతో చేశానని... తనకు నచ్చిన నటుల్లో రవితేజ ఒకడని ఇలియానా చెప్పుకొచ్చింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆ విషయాలను ఓపెన్‌గా చెప్పనంటే చెప్పను.. మొండికేసిన శ్రుతిహాసన్

సినీ లెజెండ్ కమల్ హాసన్ కుమార్తె పీకల్లోతు ప్రేమలో వుందని కోలీవుడ్ కోడైకూస్తోంది. అయితే ...

news

డబ్బుకు కక్కుర్తిపడి పాడుపని చేసిన పాకిస్థాన్ మోడల్

పాకిస్థాన్ మోడల్ ఒకరు తలదించుకునేలా ఓ పాడుపని చేశారు. డబ్బుకు కక్కుర్తిపడిన ఆ నటి అలా ...

news

అత్త ఇంట్లోకి రానివ్వలేదు.. భర్త 'ఆ' బంధం తెంచుకున్నాడు.. నటి న్యాయ పోరాటం

బాలీవుడ్ నటి ఒకరు రోడ్డున పడ్డారు. 'క్యా కూల్ హై హమ్' చిత్ర నటి, 'బిగ్‌బాస్ 9'లో ...

news

లవర్ బాయ్ సిద్ధుతో రేష్మి డేటింగ్ నిజమేనా?!!

ఎన్టీఆర్ బయోపిక్ అంటూ మీడియాలో రాంగోపాల్ వర్మ ఎలా హడావిడి చేస్తున్నారో గుంటూరు టాకీస్ ...

Widgets Magazine