శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 1 ఏప్రియల్ 2016 (13:44 IST)

జబర్దస్త్ టీమ్‌కు నోటీసులు.. న్యాయవ్యవస్థను అవమానించారంటూ?!

జబర్దస్త్ టీమ్‌కు కొత్త చిక్కు.. డబుల్ మీనింగ్ ప్రోగ్రాముల్లో ఎలా?!

జబర్దస్త్ టీవీ రియాల్టీ షోపై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెరైటీ స్కిట్స్‌కు తోడు కడుపుబ్బ నవ్వించే కామెడీతో బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునే ఈ షో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రజాదరణ పొందింది. ఆ తర్వాత క్వాలిటీ పెంచడం కోసం అనుకుని.. కామెడీలో బూతును కూడా మిక్స్ చేయడం మొదలుపెట్టడంతో విమర్శలు వెల్లువెత్తాయి. వీటికి తోడు వరుస వివాదాలతో ఇప్పుడీ జబర్దస్త్ అభాసుపాలవుతోంది. 
 
తాజాగా జబర్దస్త్‌లో ప్రసారం చేసిన ఓ స్కిట్‌పై కోర్టు నోటీసులు జారీ చేసింది. భారతీయ న్యాయవ్యవస్థను అవమానించారంటూ ఓ న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశాడు. దీనిని అంగీకరించిన కోర్టు.. జబర్దస్త్ టీంకు నోటీసులు జారీ చేసింది. గతంలో కూడా ఇలాంటి అనేక వివాదాలు జబర్దస్త్‌ను చుట్టుముట్టాయి. గతంలో ఓ స్టూడెంట్ యూనియన్ లీడర్ ఈ కార్యక్రమంపై కేసు నమోదు చేశాడు. 
 
ఆపై గౌడ మహిళలను అవమానించారంటూ.. కమెడియన్ వేణుపై దాడి కూడా జరిగింది. కామెడీ పేరుతో అసంబద్ధమైన స్కిట్స్ ప్రదర్శిస్తున్నారంటూ విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అటు పార్టిసిపెంట్స్‌తో పాటు ఇటు జడ్జీలుగా వ్యవహరిస్తున్న నాగేంద్ర బాబు రోజాలపై కూడా విమర్శలు ఎక్కువయ్యాయి. డబుల్ మీనింగ్ ప్రోగ్రామ్‌ల్లో ప్రజాప్రతినిధి అయిన రోజా ఎలా పాల్గొంటున్నారంటూ విమర్శలొచ్చిన  సంగతి తెలిసిందే.