Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హమ్మయ్య తమిళ బాహుబలికి విముక్తి లభించినట్లే.. మరి కన్నడ బాహుబలి మాటేంటి?

హైదరాబాద్, బుధవారం, 19 ఏప్రియల్ 2017 (04:24 IST)

Widgets Magazine

దర్శక ధీరుడు రాజమౌళి తీసిన ప్రతిష్టాత్మక చిత్రం విడుదలకు ఉన్న అడ్డంకులు తొలిగిపోతున్నాయి. ఇప్పటికే కర్నాటకలో ఈ చిత్రం రెండోభాగం విడుదల అయ్యే అవకాశాలు కనిపించడంలేదు. తమిళ బాహుబలి-2 విడుదలకు కూడా కారుమేఘాలు అడ్డుపడటంతో రాజమౌళి, చిత్ర నిర్మాతలు కలవరపడ్డారు. కానీ మంగళవారంతో చిత్ర విడుదలకు అడ్డుపడిన చిక్కులు విడిపోయాయి. తమిళంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న వారిపై నడుస్తున్న కేసు కోర్టు బయటే పరిష్కారానికి నోచుకోవడంతో తమిళనాడులో బాహుబలి విడుదలకు మార్గం సుగమమైంది.
ss rajamouli
 
బాహుబలి ఘన విజయం తరువాత దానికి కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రం బాహుబలి-2. ప్రబాస్, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సృష్టికర్త రాజమౌళి. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఈనెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ క్రమంలో బాహుబలి-2 విడుదలపై నిషేధం విధించాలని కోరుతూ చెన్నై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో కొద్ది రోజులుగా ఈ చిత్ర విడుదలపై గందరగోళ పరిస్థితి నెలకొంది. సమస్య కోర్టు గుమ్మం వరకూ వెళ్లింది. 
 
శ్రీ గ్రీన్‌ ప్రొడక‌్షన్‌ అధినేత శరవణన్ బాహుబలి-2 చిత్ర తమిళనాడు విడుదల హక్కులను పొందారు. రైట్స్ కొనుగోలు కోసం ఆయన 2016లో ఏసీఈ సంస్థ నుంచి రూ.1.18కోట్లు రుణం అడిగి తీసుకున్నారు, ఆ మొత్తాన్ని సంస్థ ప్రభుదేవా స్టూడియోస్‌ పేరు మీద ఇచ్చారు. తీసుకున్న రుణానికి రూ.10 లక్షలు వడ్డీతో సహా బాహుబలి-2 విడుదలకు ముందు చెల్లిస్తానని సవరణన్‌ పిబ్రవరిలో అగ్రిమెంట్‌ రాసి ఇచ్చారు. ఇప్పుడు మాట మార్చిన సరవణన్‌ బాహుబలి-2 చిత్ర విడుదల తరువాత డబ్బు చెల్లిస్తానని చెప్పడంతో మాటతేడా వచ్చిందని, తమకు సొమ్ము చెల్లించేవరకు బాహుబలి-2 విడుదలపై నిషేధం విధించాలని ఏసీఈ సంస్థ మద్రాస్ హైకోర్టును కోరింది. 
 
ఈ పిటిషన్‌ సోమవారం విచారణకు వచ్చింది. బాహుబలి-2 విడుదలపై నిషేధం విధించడానికి నిరాకరించిన న్యాయమూర్తి ఈ పిటిషన్‌కు బదులు దాఖలు చేయాల్సిందిగా శ్రీ గ్రీన్‌ ప్రొడక‌్షన్‌ అధినేత శరవణన్‌కు నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ కేసు మంగళవారం విచారణకు రాగా ఇద్దరి తరపు న్యాయవాధులు కోర్టుకు హాజరై సమస్యను కోర్టు బయట పరిష్కరించుకున్నట్లు తెలియజేయడంతో విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు.
 
తమిళ బాహుబలి-2 చిత్రవిడుదలకు అడ్డంకులు తొలిగిపోయిన వార్త వినగానే చిత్ర నిర్మాతలకు, రాజమౌళికి గుండె భారం తగ్గినట్లయింది. ఇక కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ గతంలో కావేరీ జలాల పంపిణీపై చేసిన ఒక ప్రకటన ఇప్పుడు వివాదాస్పదమై కర్నాటక మండిపోతోంది. సత్యరాజ్ కన్నడిగులపై చేసిన వ్యాఖ్యకు క్షమాపణ చెబితే కానీ బాహుబలి 2 ని కర్నాటకలో విడుదల కానివ్వమని కన్నడ సంఘాలు చెప్పడంతో కర్నాటకలో ఉద్రిక్తత నెలకొంది. సత్యరాజ్ ప్రకటనకు, బాహుబలి 2కి ఏ సంబంధమూ లేదని రాజమౌళి, చిత్ర నిర్మాతలు మొత్తుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరి క్షణంలో దీనిపై ఏదైనా పరిష్కారం కుదరకపోతే నిర్మాతకు ఒక ఏరియా మొత్తం నష్టం జరగటం ఖాయం. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఒక స్టార్ ఆవిర్భవించిన వేళ.. ఒక గర్వం ఉదయించని వేళ.. బాహుబలి రాజమౌళిదే అంటున్న ప్రభాస్

ఒక్క సినిమా.. అతడిని దేశవ్యాప్తంగా కొన్ని కోట్లమంది గుర్తు పెట్టుకునే స్టార్‌ని ...

news

టాలీవుడ్ సన్నీలియోన్... ఎవరో తెలుసా?

బుల్లితెరపై ఓ రేంజ్‌లో అందాల విందు చేసిన రష్మి, వెండితెర రీఎంట్రీ అవకాశం వచ్చేపాటికి ...

news

రాజమౌళి మహాభారతం వేరు.. శ్రీకుమార్ మేనన్ భారతం వేరు.. జక్కన్నకు ఢోకా లేదు..?!

వీఏ శ్రీకుమార్ మేనన్ దర్శకత్వంలో మహాభారంతం రూపుదిద్దుకోనుందని వార్తలు రాగానే.. జక్కన్న ...

news

బాలీవుడ్ 'మహాభారతం'.. కృష్ణుడుగా అక్షయ్ కుమార్.. భీష్ముడు... ద్రౌపది... పంచ పాండవులుగా ఎవరు?

బాలీవుడ్ "మహాభారతం‌" నిర్మాణానికి నటీనటుల ఎంపికను పూర్తి చేశారు. శ్రీకృష్ణ పాత్రధారిగా ...

Widgets Magazine