శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 24 అక్టోబరు 2015 (12:43 IST)

నానుమ్ రౌడీదాన్ హిట్: నయనతార, విఘ్నేష్‌ల పెళ్లి ఖాయమేనా?

నానుమ్ రౌడీదాన్ సినిమా హిట్ కావడంతో నయనతార ఆ సినిమా డైరక్టర్ విఘ్నేష్‌ల పెళ్లి ఖాయమని కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. సాధారణంగా నయనతార ఎవరితో ప్రేమాయణం నడిపినా ఆ వ్యక్తి సినిమా ఫ్లాప్ అనే సెంటిమెంట్ ఉండేది. అయితే నయన్, విఘ్నేష్‌ల ప్రేమాయణం మాత్రం సక్సెస్ అయ్యేలా కనిపిస్తోంది.
 
వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘నానుమ్ రౌడీ దా’ మొన్న దసరాకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఐతే నయన్ ఎవరితో ప్రేమాయణం నడిపితే ఆ వ్యక్తి సినిమా ఫ్లాప్ అన్న సెంటిమెంటు ఈసారి బ్రేక్ అయింది. ‘నానుమ్ రౌడీదా’ పెద్ద హిట్టు. ఇది నయన్ లవ్ స్టోరీ కూడా హిట్ కాబోతోందనడానికి ఇండికేషన్ అని..  సినిమాలాగే లవ్ స్టోరీ కూడా పండి..  ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోవచ్చని కోలీవుడ్‌లో వార్తలొస్తున్నాయి. 
 
కాగా.. కెరీర్ ఆరంభంలోనే శింబుతో ప్రేమాయణం నడపడం అప్పట్లో హాట్ టాపిక్. వాళ్లిద్దరి లవ్ స్టోరీ ‘వల్లభ’ సినిమాకు మంచి మైలేజీ ఇచ్చింది. కానీ ఓపెనింగ్స్ వచ్చాయి కానీ సినిమా పెద్ద ఫ్లాప్. సినిమా లాగే వాళ్ల లవ్ స్టోరీ కూడా ఎక్కువ రోజులు నిలవలేదు.
 
శింబుతో బ్రేకప్ అయిన రెండేళ్లకే ప్రభుదేవాతో పీకల్లోతు ప్రేమలో పడిపోయింది నయన్. ప్రభుదేవా డైరెక్ట్ చేసిన ‘విల్లు’ సినిమా సందర్భంగా ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ సినిమా కూడా పెద్ద ఫ్లాప్. సింబాలిక్‌గా వాళ్ల లవ్ స్టోరీ కూడా చివరికి ఫ్లాపే అయింది. ప్రభు నుంచి నయన్ విడిపోయిన సంగతి తెలిసిందే.