బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2015 (17:29 IST)

రవితేజ లిప్ లాక్ కోసం ఫోర్స్ చేయలేదు: రకుల్ ప్రీత్ సింగ్

కిక్-2లో రవితేజతో లిప్ లాక్ సీనే ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్పందిస్తూ.. రవితేజ కిక్-2లో లిప్ లాక్ కోసం పట్టుబట్టలేదని.. సన్నివేశానికి అనుగుణంగానే ఆ సీన్ పెట్టాల్సి వచ్చిందని చెప్పింది. ఇంతకీ ఆ లిప్ లాక్‌ జుగుప్సాకరంగా లేదని కూడా రకుల్ ప్రీత్ సింగ్ స్పష్టం చేసింది. టాలీవుడ్‌లో లిప్ లాక్ల విషయంలో హీరోయిన్స్ అదరగొట్టేస్తున్న సంగతి తెలిసిందే.
 
ప్రతీ సినిమాలోనూ ప్రస్తుతం లిప్ లాక్ కంపల్సరీగా మారిపోయింది. గతంలో తీన్‌మార్‌లో పవన్ కల్యాణ్-త్రిషల మధ్య లిప్ లాక్ హాట్ చర్చలకు దారితీసింది. ఈ నేపథ్యంలో రకుల్ ప్రీత్ సింగ్ లిప్ లాక్ సీనే కిక్ 2కు హైలైట్‌గా నిలిచింది. అయితే ఇది డీప్ ఫ్రెంచ్ కిస్ లాంటిది కాదని, రవితేజ ఈ సీన్ కోసం అస్సలు పట్టుబట్టలేదని, సన్నివేశానికి అనుగుణంగానే ఆ సీన్ పెట్టాల్సి వచ్చిందని వెల్లడించింది.