గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2015 (13:40 IST)

చెర్రీకి రకుల్ ప్రీత్ సింగ్ పెదవి తాంబూలం: సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?

రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న సినిమా బ్రూస్ లీ. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేందుకుగాను వీరిద్దరూ వరుసగా 24 గంటల పాటు పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో చెర్రీకి రకుల్ ప్రీత్ సింగ్ లిప్ లాక్ ఇస్తుందో లేదో అనే అనుమానం ఫ్యాన్స్ మధ్య నెలకొంది. ఈ డౌట్‌ను క్లియర్ కావాలంటే తప్పకుండా ఈ స్టోరీ చదవాల్సిందే. 
 
హీరోలకు పెదవి తాంబూలం అందించడంలో అదేనండీ లిప్ లాక్ ఇవ్వడంలో రకుల్ ప్రీత్ సింగ్ యమా స్పీడుగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ భామ కెరీర్ ఆరంభమే కుర్ర హీరోలతో లిప్ లాక్స్‌తో అదరగొట్టేసింది. ఇప్పుడు తాజాగా బ్రూస్లీ చిత్రంలో రామ్ చరణ్‌తోనూ అదే తీరుగా లిప్ లాక్ ఉంటుందని తెలుస్తోంది. అయితే లిప్ లాక్స్ రకుల్‌కు కలిసిరావట్లేదని తెలిసింది.
 
రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటివరకూ రెండు సార్లు హీరోలతో సుదీర్ఘ అదరచుంబనాల్లో పాల్గొంది. హిందీ డెబ్యూ ఫిలిం యారీయాన్లో కుర్రహీరోతో నిమిషం పైగానే ఘాటైన చుంబనం చేసింది. ఆ సినిమా ఫ్లాప్. అలాగే ఆదికి రఫ్ సినిమాలో అంతే ఘాటైన చుంబనం ఇచ్చింది. ఇక్కడ ఇది కూడా ఫ్లాపే. ముచ్చటగా మూడో ముద్దు మాస్ మహారాజ్‌కు ఇచ్చింది. అందుకే కిక్2 అట్టర్ ఫ్లాపైంది. కాబట్టి ఈసారి బ్రూస్లీతోనూ లిప్ లాక్ లాగించేసి ఉంటే సెంటిమెంటు ప్రకారం.. అదే ఫ్లాప్ రిపీటవుతుందని కొందరు కొంటె ఎనలిస్టులు కొత్త పల్లవి అందుకున్నారు. అసలే చెర్రీతో బోలెడు హోప్స్ ఉన్నాయి. ఈ సమయంలో రకుల్ లిప్ లాక్ కిస్ అంటే ఏమవుతుందో వేచిచూడాల్సిందే.