Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మహేష్ బాబు భరత్ అనే నేను.. ''ఫస్ట్ ఓత్'' వీడియో

శుక్రవారం, 26 జనవరి 2018 (10:09 IST)

Widgets Magazine
Bharat Ane Nenu

టాలీవుడ్ మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. గణతంత్రదినోత్సవం సందర్భంగా ''ఫస్ట్ ఓథ్'' పేరుతో ఓ ఆడియోను విడుదల చేస్తున్నట్లు కొరటాల ప్రకటించారు. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 'భరత్ అనే నేను'లోని ఓ కీలక డైలాగ్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.

ఈ చిత్రంలో మహేశ్ బాబు సీఎంగా నటిస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆడియోను 'ఫస్ట్ ఓత్' రూపంలో విడుదల చేశారు. ఆ ఆడియో క్లిప్ ను ప్రిన్స్ మహేశ్ స్వయంగా తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు. 
 
అలాగే ఓ ఫోటోను కూడా భరత్ టీమ్ విడుదల చేసింది. ఓ సభకు భారీగా ప్రజలు హాజరైన ఫొటోపై ''శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం.. విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతః కరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగానీ, పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను'' అనే ప్రమాణ స్వీకార పాఠంతో కూడిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అల్లు అర్జున్ నా పేరు సూర్య.. ''ఓ సైనికా'' సాంగ్ అదుర్స్ (వీడియో)

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ''నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా'' అనే సినిమా ...

news

పద్మావత్ రివ్యూ : కామ పిశాచి చేతిలో రాణి పద్మావతి ఏమైంది?(Video)

ఇటీవలికాలంలో బాలీవుడ్‌నే కాదు, యావ‌త్ సినీ ప్ర‌పంచాన్నీ కుదిపేసిన పేరు.... ప‌ద్మావ‌త్‌. ...

news

''టచ్ చేసి చూడు'' ట్రైలర్: ''ఐ యామ్ క‌మింగ్'' అంటోన్న మాస్ మహారాజ

మాస్ మహారాజ హీరోగా, రాశిఖన్నా హీరోయిన్‌గా నటించిన ''టచ్ చేసి చూడు'' సినిమా ట్రైలర్ ...

news

2019 జనవరిలో ''సాహో'' విడుదల: స్వీటీ గెస్ట్ రోల్?

2019 జనవరిలోనే ''సాహో'' సినిమా విడుదల కానుందని ఫిలిమ్ నగర్ వర్గాల టాక్. ఇటీవలే ...

Widgets Magazine