Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అభిరామ్, కోన వార్త‌లపై శివాజీ రాజా చాలా తెలివిగా త‌ప్పించుకున్నాడు!

శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (11:13 IST)

Widgets Magazine

శ్రీరెడ్డి ప్ర‌ధానంగా నిర్మాత సురేష్ బాబు త‌న‌యుడు అభిరామ్, స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్‌ల‌పై ఆరోప‌ణ‌లు చేస్తూ ఓ ఫోటోను లీక్ చేసిన విష‌యం తెలిసిందే. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా, కొన్ని టీవీ ఛానెళ్లలోనూ పదేపదే చూపించారు. ఈ విషయంపై ద‌గ్గుబాటి ఫ్యామిలీ స్పందించ‌లేదు కానీ.. కోన వెంక‌ట్ ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ త‌న‌కు ఏ పాపం తెలియ‌ద‌ని.. దీనిపై సమగ్ర విచారణ జ‌రిపించాలంటూ ప్ర‌భుత్వాన్ని కోరారు.
sivaji raja
 
ఇదిలావుంటే... మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా ఈ విష‌యంపై స్పందించారు. టాలీవుడ్ ప్రముఖులపై ఆరోపణలు చేసిన శ్రీరెడ్డిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం శివాజీ రాజా మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పారు. 
 
కోన వెంకట్, అభిరామ్ గురించి స్పందించాలని విలేకరులు కోరారు. దీంతో శివాజీ రాజా మాట్లాడుతూ కోన వెంకట్‌తో మాకు సంబంధం లేదు.. రైటర్స్ అసోసియేషన్ అనేది ఉంది. ఆ విషయం వాళ్లు చూసుకుంటారు. ఇక అభిరామ్ దుగ్గుబాటి నటుడు కాదు, నిర్మాత కాదు, మాకు సంబంధం లేని విషయం అది అంటూ చాలా తెలివిగా శివాజీ రాజా స‌మాధానం చెప్పి తప్పించుకున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

చిరంజీవి పేరు చెప్పుకుని.. 16ఏళ్ల బాలికల్ని కూడా వదల్లేదు: శ్రీరెడ్డి కొత్త లీక్

శ్రీరెడ్డి లీక్స్ టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. దగ్గుబాటి శ్రీరామ్, ...

news

చంద్ర‌బాబుపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన నంద‌మూరి హీరో..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నందమూరి హీరో ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఇంత‌కీ ...

news

వందేళ్ళ సినీ చ‌రిత్ర‌లో శ్రీరెడ్డిలా ఎవ‌రు పోరాటం చేయ‌లేదు : వర్మ

టాలీవుడ్ సెన్సేష‌న్ శ్రీరెడ్డి. టాలీవుడ్‌లోనేకాకుండా బాలీవుడ్‌లో సైతం శ్రీరెడ్డి గురించి ...

news

మ‌హేష్‌కి టార్గెట్ సెట్ చేసిన రామ్ చ‌ర‌ణ్‌..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన లేటెస్ట్ మూవీ "భ‌ర‌త్ అనే నేను". బ్లాక్ బ‌స్టర్ ...

Widgets Magazine