Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'మా' టీవీ పేరు మారిపోతోంది, లాంఛ్ చేసిన చిరు

సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (12:25 IST)

Widgets Magazine
Chiranjeevi

చిరంజీవి, నాగార్జున, మ్యాట్రిక్‌ ప్రసాద్‌ భాగస్వాములుగా వున్న 'మా' టీవీని రెండేళ్ళనాడే.. స్టార్‌ టీవీ వారు కొనుగోలు చేసేశారు. కానీ అప్పటి నుంచి పేరు మారలేదు. 'మా' అనేది బ్రాండ్‌గా తెలుగు ప్రేక్షకులకు చేరువ కావడంతో సమయం చూసి మార్చాలని నిర్ణయించారు. అందుకు ఈ సోమవారం ముడిపడింది. చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రసారం కానున్న సందర్భంగా 'మా'టీవీ పేరును స్టార్‌ అనే పేరు ముందుకు రావడం జరిగింది. కొత్త లోగో, బ్రాండ్‌ ట్యాగ్‌లైన్‌, న్యూ మోనిక్‌ థీమ్‌ ట్రాక్‌ను ఆదివారంనాడు చిరంజీవి ఆవిష్కరించారు. 
 
ఇకపై కొత్తగా కనిపించబోతున్న స్టార్‌ మా లోగో కొత్త రూపం ఎరుపు రంగులో ప్రస్పుటంగా కనపించబోతుంది. అంతర్గతంగా మా అనే అక్షరాలు బోల్డ్‌గా కనిపించనున్నాయి. అదే బంధం.. సరికొత్త ఉత్తేజం అనే ట్యాగ్‌లైన్‌ ప్రకటించారు. 
 
ఈ కార్యక్రమంలో స్టార్‌ ఇండియా సౌత్‌ ఇండియా సి.ఇ.ఒ కెవిన్‌ వాజ్‌ మాట్లాడుతూ... తమ బ్రాండ్‌ను నిర్మించుకోవాలనే స్టార్‌ లక్ష్యంలో భాగంగానే మా టీవీని సొంతం చేసుకున్నాం. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులు, అంచనాలకు అనుగుణంగా ఛానల్‌ను తీర్చిదిద్దుకోవడమే లక్ష్యంగా ప్రోగ్రామింగ్‌లో కొత్తదనంతో కూడిన వైవిధ్యమైన కార్యక్రమాలను రూపొందిస్తామని అన్నారు.
 
చిరంజీవి మాట్లాడుతూ ... తొమ్మిదేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చేటప్పుడు నన్ను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారోనని అనుకున్నాను. కానీ నా అనుమానాలను పటాపంచలు చేస్తూ ప్రేక్షకులు 150వ సినిమాతో నాకు దిగ్విజయమైన విజయాన్ని అందించారు. తెలుగు ప్రేక్షకులు ఒకసారి అభిమానిస్తే, ప్రేమిస్తే ఎప్పటికీ మరచిపోరు అని మరోసారి ప్రూవ్‌ చేశారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా అడుగుపెడుతున్నాను. ఈ మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్‌తో అడుగుపెడుతున్న నేను ఈ షో చేసేటప్పుడు ఎమోషనల్‌గా అనేక అనుభూతులకు లోనయ్యాను. ఈ ప్రోగ్రామ్‌ పేదవాడి నుండి డబ్బున్నవారి వరకు చాలామందిని కలవడంతో చాలా రకాలైన అనుభవాలను షేర్‌ చేసుకున్నాను. ఇదొక ఎంటర్‌టైన్మెంట్‌ ప్రోగ్రామ్‌ కాదు..ఎమోషనల్‌ ప్రోగ్రామ్‌. అని చెప్పారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

దేవుడా.. దేవుడా.. మాయదారి దేవుడా.. ఆ ముగ్గురిలో నాకు జగన్ అంటే ఇష్టం: పోసాని

ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తుల్లో ప్రముఖ నటుడు పోసాని కూడా ఒకరు. గతంలో ప్రజారాజ్యం తరపున ...

news

నాలుగేళ్ల తర్వాత బాహుబలి ప్రభాస్ కొత్త సినిమా నేడే ప్రారంభం

ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి కోసం నాలుగేళ్ల సమయం వెచ్చించిన ప్రభాస్ ...

news

చిరంజీవి సరసన హీరోయిన్ ఛాన్స్: నో చెప్పిన అనుష్క.. శ్రుతిహసన్‌కి ఆఫర్

ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుని రీఎంట్రీ ఫిలిమ్‌ ఖైదీ నంబర్ 150తో ...

news

ఆఫర్లు రాలేదా... ఆ కొన్నీ ఇప్పేస్తే సరి అంటున్న భామ..!

చిత్రసీమ ఎంతమంది హీరోయిన్లను చూడలేదు. స్టార్‌డమ్ ఉన్నంతవరకు బికినీ కాదు గదా గికినీ జోలికి ...

Widgets Magazine