Widgets Magazine

శివగామి పాత్ర రమ్యకృష్ణకే రాసి పెట్టి వుంది..ఆ పాత్రలో రమ్య జీవించింది: మధుబాల

శనివారం, 15 జులై 2017 (16:09 IST)

Widgets Magazine

''అల్లరిప్రియుడు" సినిమాలో రమ్యకృష్ణతో కలిసి నటించిన మధుబాల గుర్తుందా? ఈమె 'రోజా' సినిమాలో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం ఆమెకు అంతగా కలిసిరాలేదు. దీంతో చేతికందిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్న మధుబాల.. బాహుబలిలో రమ్యకృష్ణ పాత్ర గురించి నోరువిప్పింది. 
 
తన సహనటి అయిన రమ్యకు శివగామి ద్వారా మరింత హైప్ పెరగడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. బాహుబలి కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఆరంభ్ ధారావాహికలో రమ్యకృష్ణ పాత్రను మధుబాల పోషిస్తోంది. బాహుబలి సినిమాలో రమ్య పోషించిన శివగామి పాత్రను.. సీరియల్‌తో తాను చేస్తుండటం గర్వంగా ఉందని మధుబాల చెప్పింది. 
 
పనిలో పనిగా శివగామి పాత్ర కోసం శ్రీదేవిని సంప్రదించడంపై కూడా స్పందించింది. శివగామి పాత్ర రమ్యకృష్ణ చేయాలని రాసివుంది. అందుకే ఆ పాత్ర ఆమెను వెతుక్కుంటూ వచ్చిందని మధుబాల వ్యాఖ్యానించింది. ఆ పాత్రలో రమ్య జీవించిందని.. ఏ పాత్రనైనా ఆమె అవలీలగా పండిస్తుందనే సంగతి తనకు బాగా తెలుసునని మధుబాల పేర్కొంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

డ్రగ్స్ కేసులో రవితేజ పేరుందా? నోటీస్ అందిందా? తీసుకోని ఆ ఇద్దరెవరు? అరెస్టు తప్పదా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు హీటెక్కిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో టాలీవుడ్ ఇండస్ట్రీకి ...

news

కమల్ హాసన్‌‌కు మద్దతు.. ఆయనకొక సమస్య వుంటే ఊరుకోం: విశాల్ వార్నింగ్

సినీ లెజండ్ కమల్ హాసన్ ప్రస్తుతం అందరి నోళ్లల్లో నానుతున్నారు. బిగ్ బాస్ కార్యక్రమానికి ...

news

డ్రగ్స్ వ్యవహారం.. పైసా వసూల్‌తో బిజీ.. ఎవ్వరికీ స్టేట్మెంట్ ఇవ్వలేదన్న పూరీ.. వాట్సపే?

టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న డ్రగ్స్ దందాలో ప్రముఖ సినీ నటుల పేర్లు వినిపిస్తున్న సంగతి ...

news

శివకార్తీకేయన్ కోసం నువ్వా నేనా అంటోన్న నయన-సమంత?

కోలీవుడ్‌లో అగ్రహీరోయిన్లు కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారు. యాంకరింగ్ నుంచి హీరోగా ...