గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 23 జూన్ 2016 (12:24 IST)

అలియా భట్‌కు అమ్మగా మాధురీ దీక్షిత్: కరణ్ జోహార్‌కు గ్రీన్ సిగ్నల్!

ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన అలనాటి తారలు ప్రస్తుతం అత్త, అమ్మ పాత్రలకు పరిమితమవుతున్నారు. మరికొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మిగిలిపోతున్నారు. తాజాగా ఈ జాబితాలో అలనాటి కలలరాణి, అందాల రాశి మాధురీ దీ

ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన అలనాటి తారలు ప్రస్తుతం అత్త, అమ్మ పాత్రలకు పరిమితమవుతున్నారు. మరికొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మిగిలిపోతున్నారు.  తాజాగా ఈ జాబితాలో అలనాటి కలలరాణి, అందాల రాశి మాధురీ దీక్షిత్ కూడా చేరింది. ఇప్పటికే బాలీవుడ్ ముద్దుగుమ్మ హేమమాలిని బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణిలో రాజమాతగా నటిస్తున్న నేపథ్యంలో మాధురీ దీక్షిత్.. ఓ సినిమాలో తల్లిపాత్రలో కనిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 
 
అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూ.. టీవీ షోలకే పరిమితమైన మాధురీ.. అలియాభట్‌, అర్జున్‌ కపూర్, వరుణ్‌ ధావన్‌ ప్రధాన పాత్రల్లో కరణ్‌జోహర్‌ త్వరలో ''షిద్దత్‌'' సినిమాలో అలియాభట్‌కు తల్లిగా నటించేందుకు ఓకే చెప్పేసిందని తెలిసింది. ఇప్పటికే మాధురీ దీక్షిత్‌ని కరణ్‌ జోహర్‌ సంప్రదించారు. ఆ పాత్ర నచ్చి అలియాకు తల్లిగా నటించేందుకు మాధురీ ఒప్పుకున్నట్లు బీటౌన్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.