Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విజయ్ ఆంటోనీగా అర్జున్ రెడ్డి.. మహానటిలో విజయ్ దేవరకొండ పోస్టర్ ఇదే..

మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (17:38 IST)

Widgets Magazine

''మహానటి''లో ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. అర్జున్ రెడ్డితో స్టార్ హీరోగా మారిపోయిన విజయ్ దేవరకొండ.. తాజాగా అలనాటి తార సావిత్రి బయోపిక్‌లో నటిస్తున్నారు. మ‌హాన‌టి చిత్రం కోసం సావిత్రి జీవితాన్ని మ‌ధుర‌వాణి (సమంత‌) పాత్ర‌తో పాటు ఆవిష్క‌రించే మ‌రో జ‌ర్న‌లిస్ట్ పాత్రలో విజయ్ ఆంటోనీగా అర్జున్ రెడ్డి కనిపించనున్నాడు. 
 
ఇందులో భాగంగా ''8టీస్ నాటి ఛార్మ్. త‌న పేరు విజ‌య్ ఆంటోని. ఆమె క‌థ‌ను చెప్ప‌డాన్ని ఓ గౌర‌వంగా భావిస్తున్నాను'' అంటూ ''మ‌హాన‌టి''లోని త‌న పాత్ర ఫ‌స్ట్ లుక్‌ను విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్టర్‌పై నిజం ఎప్పుడు అందంగానే వుంటుంది మధురవాణి గారూ అంటూ రాసివుంది.
 
కాగా ''మహానటి''లో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించనుంది. ఈ చిత్రంలో మోహ‌న్ బాబు, దుల్క‌ర్ స‌ల్మాన్‌, షాలిని పాండే త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో కనిపించనున్నారు. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని వైజ‌యంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. మే 9న ఈ సినిమా విడుదల కానుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
మహానటి విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి విజయ్ ఆంటోనీ మధురవాణి దుల్కర్ సల్మాన్ షాలినీ పాండే Samantha Savitri #mahanati Vijay Antony Madhura Vaani Vijay Devarakonda Keerthy Suresh

Loading comments ...

తెలుగు సినిమా

news

అన్యాయాన్ని అర్థనగ్నంగా తెలిపినందుకు శ్రీరెడ్డిని చంపేస్తారట... ఎవరు?

తెలుగు సినీపరిశ్రమలో తనకు జరిగిన అన్యాయాన్ని అర్థనగ్నంగా తెలియజేసిన శ్రీరెడ్డికి ప్రాణ ...

news

"సైరా"లో మిల్కీబ్యూటీ... కోర్కె తీర్చుకోనున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న చిత్రం "సైరా నరసింహా ...

news

'నీ గెడకర్ర మొఖందానా.. షూటింగ్ స్పాట్‌కొచ్చి కొడతా' : రకుల్‌కు శ్రీరెడ్డి వార్నింగ్ (Video)

ఆ మధ్య కాస్టింగ్ కౌచ్‌పై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై నటి శ్రీరెడ్డి ...

news

ఎన్టీఆర్ బయోపిక్: కృష్ణ పాత్రలో మహేష్ బాబు.. జయలలితగా కాజల్ అగర్వాల్?

తేజ దర్శకత్వంలో దివంగత నందమూరి తారక రామారావు బయోపిక్ తెరకెక్కనుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ ...

Widgets Magazine