శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: గురువారం, 27 ఆగస్టు 2015 (14:43 IST)

ఏం... మేం గుర్తులేమా...? మహేష్ బాబుపై ఖమ్మం ముసలిమడుగు గ్రామ ప్రజలు

'శ్రీమంతుడు' చిత్రంతో తనకు నచ్చిన విధంగా తన తండ్రి చేయలేని పనిని తాను చేసి చూపించేస్తాడు మహేష్ బాబు.  అది సినిమా. కానీ రియల్‌ లైఫ్‌లో అలా చేయాలంటే కొన్ని తలనొప్పులు వున్నాయి. మహేష్ బాబు ఇటీవలే తన తండ్రి కృష్ణ పుట్టిన ఊరైన బుర్రిపాలెంను దత్తత తీసుకుంటే ఇంకో ఊరు వారు తాము గుర్తులేమా అంటూ ప్రశ్నిస్తున్నారు.
 
తాజాగా తెలంగాణలో మహబూబ్‌ నగర్‌లో ఓ గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు సిద్ధమైన మహేష్ బాబుకు తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ముసలిమడుగు అనే గ్రామ ప్రజలు ఆవేదనం చెందుతున్నారు. ఖమ్మంలోని బూర్గుంపాడు మండలం.. ముసలిమడుగు గ్రామం దత్తత కోసం ఎంతగానో ఎదురుచూస్తుంది. దానికి కారణం.. మహేష్ బాబు తల్లి ఇంద్రాదేవి పుట్టిన ఊరు అదే. అమ్మ దుర్గాంబ అంటే అక్కడ పెద్ద పేరు. ఆమె ఇల్లు కూడా వుంది. ప్రస్తుతం శిధిలావస్తలో వుంది.
 
ఆమె పేదవారికి ఆర్థిక సాయం చేసిన సంఘటనలు కూడా వున్నాయి. ఇప్పుడు ఆ గ్రామస్తులు తమకు సరైన సౌకర్యాలు లేవని వేడుకుంటున్నారు. మంచినీరు, పాఠశాలలు కట్టించమని ఇటీవలే కృష్ణ అసోసియేషన్‌కు విజ్ఞప్తి చేశారు. త్వరలో దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందని ఫ్యాన్స్‌ అధ్యక్షుడు చెబుతున్నాడు. మరి మహేష్ బాబు ఈ గ్రామాన్ని కూడా దత్తత తీసుకుంటారేమో చూడాల్సిందే.