Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మెగా హీరోల స్టైల్ మారింది.. మహేష్ విన్నర్ పాట..సితారను రిలీజ్ చేస్తాడట..

బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (15:04 IST)

Widgets Magazine
winner movie still

మెగా హీరోలు స్టైల్ మార్చుకున్నారు. సరైనోడు సినిమా నుంచి సీన్ మారిపోయింది. అల్లు అర్జున్, బోయపాటి శీను కాంబినేషన్‌లో తెరకెక్కిన సరైనోడు చిత్ర సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో టీం ఆడియో సక్సెస్ ఫంక్షన్‌ని ప్రీ రిలీజ్ పేరుతో గ్రాండ్‌గా నిర్వహించారు. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ధృవ మూవీ టీం కూడా సాంగ్స్‌ని సింగిల్‌గా రిలీజ్ చేశారు. మెగా స్టార్ 150వ చిత్రం ఖైదీ నెం 150 మూవీ టీమ్ కూడా ఇదే ఫాలో అయ్యింది. ప్రస్తుతం సాయిధరమ్ తేజ కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నాడు. 
 
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, గ్లామరస్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం విన్నర్. కమర్షియల్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నల్లమలపు బుజ్జి, ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపిచంద్ మలినేని తెరకెక్కించారు. విన్నర్ చిత్రంలో సాయిధరమ్ ఫ్యాషన్ మేగజైన్ ఎడిటర్‌గా కనిపించనున్నాడు. తేజూ సరసన రకుల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యేందుకు సన్నద్ధమవుతోంది. 
 
ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని 'సితార' అనే పాటను సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు విడుదల చేయనున్నారు. సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌. తమన్‌ ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు. 'మంచి హృదయం కలిగిన మన సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుకు ధన్యవాదాలు' అంటూ ట్వీట్‌ చేశారు. బుధవారం సాయంత్రం 7 గంటలకు మహేశ్‌ పాటను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మొదలైన మోహనకృష్ణ ఇంద్రగంటి మల్టీసారర్ మూవీ!

అర్థవంతమైన చిత్రాలకు పెట్టింది పేరు మోహనకృష్ణ ఇంద్రగంటి. "జెంటిల్‌మెన్" వంటి సూపర్ హిట్ ...

news

దాపెట్టుకోవడం ఎంత తప్పో తెలిసింది.. అందుకే అందాలు ఆరబోస్తున్నా : రాశీఖన్నా

చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాక మన వద్ద ఉన్నదాన్ని ఏదీ దాచిపెట్టుకోరాదనీ, అలా ...

news

బాహుబలి 2: విడుదలకు ముందే రికార్డ్.. రూ.500 కోట్ల బిజినెస్ అయ్యిందట..

ఖైదీ, శాతకర్ణి సినిమాలకు తర్వాత ఈ ఏడాదిలో మరో భారీ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. ...

news

నాన్నకు చైతూ-సమ్మూ ప్రేమ అప్పుడే తెలిసిపోయిందేమో.. వాళ్ళ పెళ్ళి వాళ్ల ఇష్టమే: నాగ్

'ఓం నమో వేంకటేశాయ' ప్రమోషన్‌లో భాగంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున ఆసక్తికర ...

Widgets Magazine