శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (17:57 IST)

కాపీరైట్: శ్రీమంతుడుగా చచ్చేంత ప్రేమ నవల.. మహేష్ బాబు-కొరటాల కోర్టుకు రావాల్సిందే..

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు శ్రీమంతుడు సినిమా ద్వారా కష్టమొచ్చింది. 60 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఆరు నెలల్లో నిర్మించిన 'శ్రీమంతుడు' 25 రోజులకే 154 కోట్ల రూపాయలను వసూళ్లు చేసి టాలీవుడ్‌లో రికార్డు సృ

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు శ్రీమంతుడు సినిమా ద్వారా కష్టమొచ్చింది. 60 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఆరు నెలల్లో నిర్మించిన 'శ్రీమంతుడు' 25 రోజులకే 154 కోట్ల రూపాయలను వసూళ్లు చేసి టాలీవుడ్‌లో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా సుప్రీమ్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిపోయింది. 
 
అయితే ఈ సినిమాలో నటించిన మహేష్ బాబు కోర్టుకు హాజరు కావాలని నాంపల్లి కోర్ట్ నోటీసులు జారీచేసింది. మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా స్టోరీనే ఇందుకు కారణం. ఈ సినిమాకు సంబంధించిన కథ 2012లో స్వాతి మాసపత్రికలో 'చచ్చేంత ప్రేమ' అనే నవలను 'శ్రీమంతుడు' చిత్రంగా మలచారంటూ రచయిత శరత్ చంద్ర గతంలో నాంపల్లి కోర్ట్‌లో పిటిషన్ ధాఖలు చేశారు. అప్పుడే సినీ యూనిట్ సభ్యులకు నోటీసులు కూడా నాంపల్లి కోర్టు ఇచ్చింది. మళ్లీ దీనిపై మంగళవారం కోర్టు విచారణ జరిపింది. 
 
కథను సినిమాగా మార్చడంతో సెక్షన్ కాపీ రైట్స్ యాక్ట్ 63 కుట్ర పూరిత నేరం.. భారతీయ శిక్షా స్మృతి 120 బి కింద కేసు నమోదు చేయాలంటూ పిటిషన్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. వాదోపవాదాలు వినిన కోర్టు ఎమ్ బి క్రియేషన్స్ అధినేత మహేష్ బాబు‌కు మైత్రి మూవీస్ అధినేత ఎర్నేని నవీన్‌కు, చిత్ర దర్శకుడు కొరటాల శివలను మార్చి 3 వ తేదీన నాంపల్లి కోర్ట్ హాజరు కావాలని ఆదేశించింది. దీంతో శ్రీమంతుడు సినీ యూనిట్ మార్చి 3వ తేదీ కోర్టుకు హాజరు కావాల్సి వుంది.