బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: శనివారం, 1 ఆగస్టు 2015 (15:54 IST)

'బాహుబలి 2' కథ చెబితే 'శ్రీమంతుడు' సినిమా టిక్కెట్లు ఫ్రీ....

బాహుబలి కలెక్షన్లు క్రేజ్‌ను తట్టుకునేందుకు... శ్రీమంతుడు చిత్ర నిర్మాతలు ఓ కాంటెస్ట్‌ను పెట్టారు. బాహుబలి పార్ట్‌-2లో కథ ఏమై వుంటుందనే విషయాన్ని తెలుగు, ఇంగ్లీషులో కానీ రాసి పంపితే.. శ్రీమంతుడు సినిమాకు ఫ్రీగా ఒక్కొక్కరికి రెండు టిక్కెట్లు అందిస్తామని తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వెబ్‌సైట్‌ను వారు వాడుకుంటున్నారు. 
 
శ్యామ్‌ప్రసాద్‌కు చెందిన వెబ్‌సైట్‌ ఆధ్వర్యంలో ఈ కాంటెస్ట్‌ నిర్వహిస్తున్నారు. ఆ వివరాలను సోమవారం నాడు ప్రకటించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై హీరో మహేష్‌కు భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రానికి ఆయన సహనిర్మాత కూడా.