గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 14 అక్టోబరు 2016 (12:35 IST)

మహేష్ బాబు వదులుకున్నాడు....అలీ హీరో అయ్యాడు

అలీని హీరోగా చేసిన మొదటి చిత్రం ''యమలీల''. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిన విషయమే. ఇప్పటికీ సినిమా టీవీలో వస్తుందటే ఆసక్తిగా వీక్షిస్తుంటారు. అలాంటి యమలీలకి ఓ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉందండోయ్. ఆ

కమెడియన్ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. బాల నటుడిగా తెలుగు తెరకు పరిచయయి ఆ తర్వాత టాప్ కమెడియన్‌గా ఎదిగి....'యమలీల' సినిమాతో హీరోగా మారిన అలీ, ఆ తర్వాత 'పిట్టల దొర' సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఈ తరువాత  హీరోగా నటించిన ఇతర సినిమాలు అంతగా హిట్ అవలేదు. అయినా కామెడీ పాత్రలు చేస్తూ...అప్పుడప్పుడు హీరో‌గా చేస్తూ టాలీవుడ్‌లో నిలదొక్కుకుంటూ వచ్చాడు. 
 
అలీని హీరోగా చేసిన మొదటి చిత్రం ''యమలీల''. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిన విషయమే. ఇప్పటికీ సినిమా టీవీలో వస్తుందటే ఆసక్తిగా వీక్షిస్తుంటారు. అలాంటి యమలీలకి ఓ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉందండోయ్. ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలుసా... ఈ చిత్రాన్ని మహేష్ బాబు చేయాల్సింది. కాని చివరికి అలీకి వెళ్ళింది. ఈ విషయాన్ని స్వయంగా అలీ ఇటీవల మీడియాతో చెప్పారు.
 
యమలీల చిత్రం 1994లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చింది. దర్శకుడు తొలుత ఈ చిత్రాన్ని మహేష్ బాబుతో చేయాలని ప్లాన్ చేసారు. అప్పటికి మహేష్ బాబు హీరోగా తెరంగ్రేటం చేయలేదు. ఈ సినిమాతో ఆయన్ను హీరోగా పరిచయం చేద్దామని ఎస్వీ కృష్ణారెడ్డి భావించారట. మహేష్ బాబు ఫాదర్ కృష్ణ గారికి 'యమలీల' స్టోరీలైన్ చెప్పారు. ఆయనకు స్టోరీ ఎంతగానో నచ్చింది. కానీ మూడేళ్లు వెయిట్ చేయమని చెప్పారు. దీంతో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి నన్ను సంప్రదించారు. 
 
అలా నాకు హీరోగా అవకాశం వచ్చింది. తొలుత ఈ చిత్రానికి 'యమస్పీడు' అనే టైటిల్ అనుకున్నాం. ఆ తర్వాత 'యమలీల'గా మార్చాం అని అలీ చెప్పుకొచ్చారు. అప్పట్లో మహేష్ బాబు తండ్రి కృష్ణ అంగీకరించక పోవడం వల్లనే ఆ సినిమాలో నాకు నటించే అవకాశం వచ్చిందని అలీ తెలిపారు.