బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2016 (16:53 IST)

బరాక్ ఒబామాతో బికినీ క్వీన్ మల్లికా షెరావత్ ఫోటో.. నెట్లో హల్ చల్!

బికినీ క్వీన్ మల్లికా షెరావత్‌కు ప్రస్తుతం అవకాశాలు అంతంతమాత్రంగానే ఉండటంతో ఇక పబ్లిసిటీ కోసం సెలెబ్రిటీలతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కాలం గడుపుతోంది. చాలాకాలం క్రితమే హాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వెళ్ళిపోయిన ఈ సుందరాంగి.. కంప్లీట్‌గా లాస్ ఏంజెల్స్‌లోనే సెటిల్ అయిపోయింది. గత ఐదేళ్లలో ఈమె చేసిన హిందీ సినిమాలు రెండే రెండంటే.. హాలీవుడ్‌‍లో ఏ రేంజ్ ప్రయత్నాలు చేసేస్తోందో అర్థం చేసుకోవచ్చు. 
 
ఇప్పుడు ఒక్కసారిగా మల్లిక గురించి బాలీవుడ్ జనాలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దీనికి కారణం ఆమె పోస్ట్ చేసిన ఒక ఫోటోనే. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలిసి ఓ సెల్ఫీ దిగిన ఈ భాష.. ఆ భామను సోషల్ మీడియాలో పెట్టింది. ఇప్పటికే ఓసారి ఒబామాను కలిసిన ఈమె.. గతవారం రోజులుగా వాషింగ్టన్‌లో ఉంటోంది. మరోసారి అమెరికా ప్రెసిడెంట్‌ను కలిసి.. ఆ సంతోషాన్ని ట్విట్టర్ జనాలతో పంచుకుంది. "ఇంత ఛరిష్మా ఉన్న ఒకే ఒక్క ప్రెసిడెంట్ బరాక్ ఒబామాను మళ్లీ కలుసుకునే అదృష్టం దక్కింది"అంటూ ట్వీట్ రాసి మల్లికా షెరావత్ చేసిన పోస్ట్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.