గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 23 జులై 2015 (15:32 IST)

జ్యోతిలక్ష్మీ మంత్ర 2 రిలీజ్‌కు సిద్ధం: జూలై 31న ముహూర్తం

జ్యోతిలక్ష్మీ రిలీజై హిట్టైన నేపథ్యంలో ఛార్మింగ్ గర్ల్ ఛార్మి మంత్ర 2గా రాబోతోంది. మంత్రతో హారర్ మూవీలో నటించిన ఛార్మీ.. మంత్ర 2‌లో మెరుగైన నటన ద్వారా  ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సినీ యూనిట్ తెలిపింది. కాగా మంత్ర 2 జూలై 31వ తేదీన రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. 
 
ఎస్వీ సతీష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా చార్మీ సక్సెస్‌ఫుల్ హిట్ మంత్రకు సీక్వెల్ కావడం గమనార్హం. ఇకపోతే.. మంత్ర 2ను శౌరి రెడ్డి గ్రీన్ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు. జ్యోతిలక్ష్మీ ఫేమ్ సునీల్ కశ్యప్ మంత్ర 2కు సంగీతం సమకూర్చాడు.