గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (09:45 IST)

హాలీవుడ్‌కి వెళ్ళడం కాదు.. త్వరలో పెళ్ళి చేసుకుంటా!: ప్రియాంకా చోప్రా

క్వాంటికో సీరియల్‌లో నటించిన తర్వాత హాలీవుడ్‌కు వెళ్ళిపోతానంటూ మీడియాలో వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. త్వరలో ఓ ఇంటికి కోడలుగా వెళ్తానని బాలీవుడ్ నటీమణి ప్రియాంక చోప్రా వెల్లడించింది. త్వరలో తాను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రియాంకా చోప్రా వెల్లడించింది.

ఎప్పుడూ నవ్వించేవాడంటే తనకెంతో ఇష్టమని.. తనను మంచిగా చూసుకునేవాడే భర్తగా రావాలని.. అందరి అమ్మాయిల్లా తాను కోరుకుంటున్నానని.. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ప్రియాంక చోప్రా వెల్లడించింది. 
 
త్వరలో వెడ్డింగ్ కార్డు కొట్టించి తన వివాహం అట్టహాసంగా జరుగుతుందని.. కానీ ఆ టైమ్ కోసం వేచిచూస్తున్నానని తెలిపింది. కాగా 33 ఏళ్ల ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లో అగ్రహీరోయిన్ వెలుగుతూ హాలీవుడ్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బాజీరావు మస్తానీలో నటించింది.

ఇకపోతే.. ఇటీవల ప్రేమ పేరుతో మోసం చేసే వాడిని చెంపచెల్లుమనిపిస్తానని వ్యాఖ్యానించిన సంగతి విదితమే. తనకు మగాడి అవసరం పిల్లల్ని కనేందుకేనని, తనను ప్రేమించాలంటే నిజాయితీ కలిగివుండాలని ప్రియాంక చోప్రా తెలిపింది.