Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

టాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం: ప్రముఖులకు నోటీసులు.. మాకేపాపం తెలియదంటూ..?

శుక్రవారం, 14 జులై 2017 (11:47 IST)

Widgets Magazine

టాలీవుడ్‌లో డ్రగ్స్ దందా కలకలం రేపుతోంది. ఇప్పటికే డ్రగ్స్ దందాలో మొత్తం 40 మంది టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖుల పేర్లు ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం 12 మందికి నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, తొలుత అరెస్ట్ అయిన కెల్విన్ నుంచి పూరీ జగన్నాథ్ స్వయంగా మాదక ద్రవ్యాలను కొనుగోలు చేసే వాడని పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి. 
 
పూరీ డ్రగ్స్ కొన్నట్టు స్పష్టమైన ఆధారాలు వుండగా, ఆయన నుంచి హీరోయిన్ చార్మీ, క్యారెక్టర్ నటుడు సుబ్బరాజులకు ఇచ్చినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఇక జీశాన్ అనే నైజీరియన్ నుంచి హీరో రవితేజకు పలుమార్లు డ్రగ్స్ వెళ్లాయని సిట్ అధికారులు నిర్ధారించుకున్నారు. ఆ తరువాతే రవితేజకు నోటీసులు పంపారని సమాచారం. రెండో జాబితా ప్రకారం నోటీసులు పంపేందుకు ఎక్సైజ్ రెడీ అవుతోంది. ఈ కేసులో తొలుత అరెస్ట్ అయిన కెల్విన్ సహా పలువురి కాల్ డేటాలో వీరందరి నంబర్లు ఉన్నాయి. 
 
అయితే ఇప్పటికే రవితేజ, నందు, నవదీప్, ముమైత్ ఖాన్, పూరీ జగన్నాథ్, ఛార్మీలకు ఎక్సైజ్ నోటీసులు పంపినట్లు టీవీల్లో వార్తలు వస్తున్నాయి. కానీ వీరందరూ తమకే పాపం తెలియదంటున్నారు. తన భర్త నందుకు సిట్ పోలీసుల నుంచి నోటీసులు వచ్చాయని మీడియాలో వార్తలు చూసి అవాక్కయ్యానని అంది. నందుకు ఎటువంటి చెడు అలవాట్లూ లేవని స్పష్టం చేసింది. నందు కూడా ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. తనకు ఎలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశాడు. నవదీప్‌ను కాపాడేందుకు ఐదుగురు అగ్రహీరోలు రంగంలోకి దిగినట్లు సమాచారం. తాను సిగరెట్ కూడా తాగనని తనకు నోటీసులేంటి అంటూ ఆర్ట్ డైరక్టర్ చిన్నా అన్నాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సమంతకు ప్రతీరోజూ శృంగారం ఉండాలట.. పెళ్లయ్యాక ఇంట్లోనే కూర్చోమంటారా?

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గాలి.. టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతకు సోకినట్లుంది. ...

news

డ్రగ్స్ మత్తులో టాలీవుడ్: రవితేజ, నవదీప్, ఛార్మీ, ముమైత్, పూరీలకు ఎక్సైజ్ నోటీసులు?

డ్రగ్స్ మత్తులో టాలీవుడ్‌ జోగుతుంది. ఆ మత్తును వదిలించేందుకు హైదరాబాదు పోలీసులు కార్యాచరణ ...

news

ఆ నటి పేరును దాచిపెట్టకండి.. పేరును పేర్కొనడంలో తప్పేమీ లేదు: కమల్

మలయాళ నటి భావన కిడ్నాప్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దాదాపు ఐదు ...

news

దిలీప్ అరెస్టుతో అందరిలాగానే నేను కూడా షాకయ్యా.. నేరం చేస్తే శిక్ష తప్పదు: భావన

కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో మలయాళ స్టార్ హీరో దిలీప్‌ అరెస్టుతో అందరిలాగానే తాను ...

Widgets Magazine