గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 2 సెప్టెంబరు 2015 (13:40 IST)

'రుద్రమదేవి'లో మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కు సమ్‌థింగ్ ఉందట... చూస్తేనే తెలుస్తుందట...

హిస్టారికల్ మూవీ బాహుబలి భారీ హిట్ తర్వాత అదే ఫార్ములాతో తెలుగు వెండితెరపైకి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం రుద్రమదేవి. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఉన్న సంగతి తెలిసిందే. ఇకపోతే మెగా ఫ్యాన్స్ కు రుద్రమదేవిలో సమ్ థింగ్ స్పెషల్ ఉందంటూ ప్రచారం సాగుతోంది. అదేంటి అనేది చిత్రం చూశాక మాత్రమే తెలుస్తుందని అంటున్నారు. 
 
కాగా ఈ రుద్రమదేవి చిత్రం అక్టోబరు 9న విడుదల కాబోతోంది. 3వ శతాబ్దం కాలం నాటి రాణీ రుద్రమదేవి జీవితగాధనే ఈ చిత్రంగా తీస్తున్నారు గుణశేఖర్. రుద్రమదేవి పాత్రలో అందాల అనుష్క నటిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో అల్లు అర్జున్, రానా, ప్రకాష్ రాజ్, కృష్ణంరాజు, నిత్యా మీనన్, కేథరిన్ థెరిస్సా, హంసా నందిని, సుమన్, జయప్రకాష్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు.